2ఏళ్ల కష్టం..వినూత్నమైన కాన్సెప్ట్.. ప్రమోషన్ లేకుండా రిలీజ్ చేసి తప్పు చేశారా..?
May 26, 2023 / 11:51 PM IST
|Follow Us
‘స్పై’ థ్రిల్లర్స్ కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వీటికి క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అనే తేడా ఏమీ ఉండదు. అడివి శేష్ ‘గూఢచారి’ నుండి మొన్నొచ్చిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీ కూడా స్పై థ్రిల్లరే. ఆ సినిమాలను జనాలు ఎగబడి చూశారు. తాజాగా మరో స్పై థ్రిల్లర్ మూవీ వచ్చింది. అదే ‘గ్రే’. బుల్లితెర నటుడు అలీ రెజా, అరవింద్ కృష్ణ, ప్రతాప్ పోతన్, ఊర్వశీరాయ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మూవీ ఇది.
‘ద స్పై హూ లవ్డ్ మి’ అనేది ఈ చిత్రం యొక్క ట్యాగ్‌లైన్. రాజ్ మదిరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని… ‘అద్వితీయ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ పై కిరణ్ కాళ్లకూరి నిర్మించారు. ఈ మూవీ పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌కు కూడా ఎంపికైంది. అయితే మే 26న ఎటువంటి చప్పుడు లేకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ స్పై థ్రిల్లర్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇది బ్లాక్ అండ్ వైట్ లో రూపొందింది.
దాదాపు 40 ఏళ్ళ తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ఏకైక స్పై థ్రిల్లర్ మూవీ ఇదే. రాధిక మొదటి భర్త ప్రతాప్ పోతన్ నటించిన చివరి చిత్రం కూడా..! ‘కొన్నేళ్ల క్రితం ఇండియాలో 2 ఏళ్ళ వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. అంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు జరిగింది. వీటన్నిటికి కారణం..
ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వారు చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసిన ఆపరేషన్స్. ఆ థీమ్ ను బేస్ చేసుకుని తీసిన సినిమానే ఈ ‘గ్రే’. సినిమా కాన్సెప్ట్ బాగుంది. రెండేళ్లు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారు మేకర్స్. కానీ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ప్రమోషన్ బాగా చేసి రిలీజ్ చేస్తే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది.