Rana Daggubati: ‘భీమ్లా నాయక్’ నుండీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • September 17, 2021 / 04:55 PM IST

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భీమ్లా నాయక్’ ఈరోజు సాయంత్రం 4:05 కి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు నిర్మాతలైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఆ అప్డేట్ రానా పాత్రకి సంబంధించిన గ్లిమ్ప్స్ గురించే అనేది ఇన్సైడ్ టాక్. ఇటీవల ‘భీమ్లా నాయక్’ టైటిల్ ను అలాగే పవన్ కళ్యాణ్ పాత్రని పరిచయం చేస్తూ ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ లుంగీ లుక్ లో చాలా అగ్రసివ్ గా అరుస్తూ వస్తున్నట్టు అందులో చూపించారు.

ఇందులో పవన్ కోపిష్టి పోలీసోడు పాత్రలో కనిపించబోతున్నట్టు ఆ గ్లిమ్ప్స్ ద్వారా స్పష్టం చేశారు. ‘రేయ్ డానీ బయటకి రారా నా కొడకా’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్..తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకర్షించాయనే చెప్పాలి. ఇప్పుడు డానీ ని బయటకి తీసుకురాబోతున్నారని స్పష్టమవుతుంది. డానియల్ శేఖర్ అనే పాత్రలో రానా కనిపించబోతున్నాడు. సినిమాలో ఇతని పాత్ర కూడా అత్యంత కీలకం.

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళం సినిమాకి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రం సింగిల్ హీరో సినిమాగా ప్రచారమవుతుంది. అది ఒక్కటే చిన్న డిజప్పాయింట్మెంట్ అని అంతా భావిస్తున్నారు.సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..సాయంత్రం వచ్చే అప్డేట్ నిజంగా రానా పాత్ర కోసమేనా లేక అతని పోస్టర్ ను విడుదల చేసి సరిపెట్టేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus