‘రెబల్’ ఆ నిర్మాత చెయ్యల్సింది.. కానీ ఎస్కేప్ అయ్యాడు..!

  • May 19, 2020 / 11:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అది బాహుబలి వల్లే అని అందరికీ తెలిసిందే. అయితే బాహుబలికి ముందు కూడా ప్రభాస్ స్టార్ హీరోనే. ‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సూపర్ హిట్ లు చేసి అప్పటికి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే ‘రెబల్’ అనే కళాకండాన్ని తీసి ఫ్లాప్ అందుకున్నాడు. లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రభాస్ కు ఉన్న క్రేజ్ కారణంగా కలెక్షన్స్ మాత్రం పర్వాలేదు అనిపించింది.

అయినప్పటికీ దర్శకుడు లారెన్స్ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టించాడు కాబట్టి… నిర్మాతలు అయిన భగవాన్ పుల్లారావు లు గోల పెట్టేసారు. దాంతో తన రెమ్యూనరేషన్ లో సగం వెన్నక్కి కూడా ఇచ్చాడు దర్శకుడు లారెన్స్. అయితే ఈ చిత్రాన్ని ముందుగా వేరే నిర్మాత నిర్మించాల్సి ఉండట. ఆ నిర్మాత మరెవరో కాదు మన బండ్ల గణేష్. ఇండస్ట్రీలో ఏదో రకంగా బ్రతికెయ్యాలి అంటే బండ్ల గణేష్ లాగా అదృష్టం కూడా తోడవ్వాలి అనడంలో అతిశయోక్తి లేదు. కమెడియన్ గా ఉండే ఇతను నిర్మాతగా మారి ఏకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసాడు.

ప్రభాస్ తో సినిమా చెయ్యాలని ఉంది అని కూడా అడిగాడట. దానికి ప్రభాస్ వెంటనే ఓకే చెప్పి లారెన్స్ వద్దకు వెళ్ళి కథ వినమని చెప్పాడట. కానీ ఎందుకో అతను వెళ్ళలేకపోయాడట. ఆ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు. అయితే ఫ్లాప్ నుండీ తప్పించుకున్నాను అని ఆనందపడాలి కానీ ఆ సినిమా చెయ్యలేకపోయాను అని బాదెందుకు అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆ ఫ్లాప్ రెజల్ట్ చూపించి ఇప్పుడు ఇంకో సినిమా చేసే అవకాశం సంపాదించే ఛాన్స్ మిస్ అయ్యాడని.. అతని అభిప్రాయం కావచ్చు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus