Salaar: ప్రభాస్ పై ఇంత కోపమేంటి.. అలాంటి కామెంట్లు అవసరమా?
July 8, 2023 / 06:23 PM IST
|Follow Us
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ నుంచి విడుదలైన టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. కొంతమంది ప్రభాస్ ను మరిన్ని సెకన్ల పాటు చూపించి ఉంటే తమకు సంతృప్తిగా ఉండేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలను మించి సలార్ సినిమా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సలార్ టీజర్ ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అయితే బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సలార్ టీజర్ పై, ప్రభాస్ పై విషం కక్కడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న వివేక్ అగ్నిహోత్రి హింసను కోరుకుని ఎవరూ పుట్టరని సినిమా ఇండస్ట్రీ పెద్దలు పిల్లలు శాంతి వైపుగా నడిచే విధంగా ప్రోత్సహించాలని చెప్పుకొచ్చారు. సినిమాలలో, రాజకీయాలలో హింసను ఫ్యాషన్ గా మార్చేసున్నారని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.
మితిమీరిన హింసను ప్రమోట్ చేయడం, అర్థం లేని సినిమాలను తెరకెక్కించడం కూడా టాలెంట్ గానే పరిగణించబడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. నటుడు కాని వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్ అని ప్రమోట్ చేయడం టాలెంట్ అని వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. తన డైరెక్షన్ లో తెరకెక్కిన ది వ్యాక్సిన్ వార్ కు పోటీగా సలార్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ డైరెక్టర్ విషం కక్కుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
స్టార్ హీరో ప్రభాస్ మాత్రం ఇలాంటి విమర్శలను పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే. తన పని తాను చూసుకోవడానికి ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తారు. సలార్, ప్రాజెక్ట్ కే ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలుస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు ఊహించని స్థాయిలో ఖర్చు చేశారు. ఈ సినిమాలలో స్టార్ క్యాస్ట్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే.