Karan Johar: ఆ హీరో ఎంతో అండగా నిలిచారు.. నన్ను అర్థం చేసుకున్నారు!
September 1, 2023 / 06:20 PM IST
|Follow Us
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో కరణ్ జోహార్ ఒకరు. ఈయన బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ దర్శకుడిగాను నిర్మాతగాను ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా కెరియర్ పరంగా కరణ్ ఎంతో మంచి సక్సెస్ అందుకోగా వ్యక్తిగత కారణాల వల్ల ఈయన తరచూ విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. కరణ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.
ఈ క్రమంలోనే ఈయన గురించి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు ముఖ్యంగా కొందరు ఈయనని టార్గెట్ చేస్తూ తాను ఒక గే అంటూ తనపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కరణ్ ఈ వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తనని అందరూ కూడా గే అని పిలవడంతో తాను ఎంతో బాధపడ్డాను ఈ మాటలు తనని ఎంతగానో కృంగదీసాయని తెలిపారు.
గే అనే పదం వింటే ఈ ప్రపంచం నుంచి నన్ను చాలా దూరంగా నెట్టేశారన్న భావన తనలో కలిగేదనే ఈయన తెలిపారు. ఇలా నేను ఎన్నోసార్లు ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నానని అయితే అప్పట్లో నాకు మాత్రం అండగా నిలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి షారుక్ ఖాన్ అని తెలిపారు. షారుక్ ఖాన్ ఒక అన్నయ్యలా నాకు అండగా నిలిచి నన్ను ప్రోత్సహించారు.
ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు (Karan Johar) అండగా నిలిచినటువంటి మొదటి వ్యక్తి షారుఖ్ అంటూ కరణ్ జోహార్ తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో తిరిగి మెగాఫోన్ పట్టారు. గత నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.