బాలీవుడ్ వారసురాళ్లు.. తెలుగులో సక్సెస్ కాలేకపోతున్నారే!
August 27, 2022 / 11:23 AM IST
|Follow Us
గత కొంతకాలంగా టాలీవుడ్ క్రేజ్ పెరగడంతో.. చాలా మంది బాలీవుడ్ నటులు తెలుగులో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య చాలా మంది బాలీవుడ్ స్టార్ కిడ్స్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వారికి చేదు అనుభవాలే మిగిలాయని చెప్పాలి. 2019లో నటుడు శక్తి కపూర్ కూతురు శ్రద్ధా కపూర్ ‘సాహో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైంది.
కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. సినిమాలో శ్రద్ధా పెర్ఫార్మన్స్ ను కూడా విమర్శించారు. ఈ ఏడాది ఆరంభంలో మహేష్ భట్ కూతురు అలియా భట్ కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో సీత క్యారెక్టర్ పోషించింది అలియా. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ.. అలియాకు మాత్రం గుర్తింపు రాలేదు. అసలు అలియా ఇలాంటి రోల్ ఎలా ఒప్పుకుందనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ సినిమా అలియా కెరీర్ కి ఎంత మాత్రం హెల్ప్ చేయలేకపోయింది.
ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురే అనన్య. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటుంది ఈ బ్యూటీ. ‘లైగర్’ లాంటి పాన్ ఇండియా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. గురువారం నాడు విడుదలైన ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అనన్య పాండే నటనపై కూడా ట్రోల్స్ పడుతున్నాయి.
ఇదంతా చూస్తుంటే.. బాలీవుడ్ నెపో కిడ్స్ కి తెలుగులో సక్సెస్ కావడం ఛాలెంజింగ్ గా మారిందనే చెప్పాలి. మరోపక్క ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని మృణాల్ ఠాకూర్ లాంటి వాళ్లు తెలుగులో సత్తా చాటుతుంటే.. ఈ స్టార్ కిడ్స్ మాత్రం తెలుగు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోతున్నారు.