చరణ్, బోయపాటి సినిమాలో నటించనున్న బాలీవుడ్ హీరో!

  • December 18, 2017 / 08:12 AM IST

ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్  డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో “రంగస్థలం ” చేస్తున్నారు. గ్రామీణ యువకుడిగా చెర్రీ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇది విశేషంగా ఆకట్టుకుంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ మార్చిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకాకముందే నెక్స్ట్ సినిమా షూటింగ్ ని చరణ్ మొదలెట్టనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలుకానుంది. అందుకు తగ్గట్టు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆర్టిస్టుల సెలక్షన్ దాదాపు ఫైనల్ అయిందని సమాచారం. ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ని తీసుకున్నారు తెలిసింది. “రక్తచరిత్ర” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వివేక్  “ఖైదీ నంబర్ 150 ”  లో నటించాల్సింది. కానీ మిస్సయింది.

ఇప్పుడు చరణ్ చిత్రంలో విలన్ గా కనిపించనున్నారు. హీరో, విలన్ పాత్రలను సునాయాసంగా మెప్పించగల ఈ స్టార్.. చరణ్ సినిమాకి ప్లస్ అవుతారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్ ఫిక్స్ అయిందని, రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషించనుందని టాక్. రామ్ చరణ్ ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ కూడా ఒకే అయింది. ఎస్.ఎస్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోజూనియ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus