మాట నిలబెట్టుకోవడం కోసం తీసిన సినిమా ఇది : బోయపాటి శ్రీను
July 8, 2020 / 12:01 PM IST
|Follow Us
ఎంతో మంది మాస్ డైరెక్టర్స్ తెలుగులో ఉన్నప్పటికీ.. వారిలో బోయపాటికి ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ఎలాంటి ఎమోషన్ అయినా సరే పతాకస్థాయిలో తెరపై ప్రదర్శించగల ఏకైక దర్శకుడు బోయపాటి. మాస్ సీన్స్ ను ఎలివేట్ చేయడంలో బోయపాటి ఘనాపాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “జయ జానకి నాయక”. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్-ప్రగ్య కథానాయికలు. ఆగస్ట్ 11న విడుదలవుతున్న ఈ చిత్రం గురించి బోయపాటి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..!!
కథ బట్టి టైటిల్ ఉంటుంది..
నా కెరీర్ లో మొదటిసారిగా హీరోయిన్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని టైటిల్ నిర్ణయించడం జరిగింది. సినిమా టైటిల్ సాఫ్ట్ గా ఉందని చాలామంది చెప్పారు. కానీ.. టైటిల్ తో సినిమా కథని ఎలివేట్ చేయడం కోసం “జయ జానకి నాయక” అనే టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగింది.
నా మార్క్ ఉండడం పక్కా..
ప్రతి మనిషికీ ఒక అలవాటు ఉంటుంది. నాకు ఎలాంటి ఫుడ్ తిన్నాసరే పచ్చడి లేకపోతే ముద్ద దిగదు. అలాగే.. నేను అలాంటి సినిమా తీసినా సరే అందులో యాక్షన్ అనేది కంపల్సరీ. అదే నా మార్క్, ఆ మార్క్ అనేది లేకుండా నేను ఆశల సినిమా తీయలేను.
నేటితరానికి అవసరమైన ప్రేమకథ..
“జయ జానకి నాయక” ఒక ట్రెండీ లవ్ స్టోరీ. నేటి తరం ప్రేమల్లో నిజాయితీ కొరవడింది, జీవితంలో ఏదైనా కష్టం వస్తే ప్రేమను వదిలేయడానికి సిద్ధపడుతున్నారే కానీ.. ఆ కష్టాన్ని ఎదుర్కొని ప్రేమను గెలుచుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని మా సినిమా ద్వారా తెలియజేస్తున్నాం.
మాట నిలబెట్టుకోవడం కోసం..
“సరైనోడు” తర్వాత చాలా పెద్ద హీరోల ఆఫర్లు వచ్చాయి, బోలెడు మంది నిర్మాతలు అడ్వాన్స్ లు పట్టుకొని నా వెనుక తిరిగారు. కానీ.. “మీకో సినిమా చేస్తాను” అని బెల్లంకొండ సురేష్ గారికి ఒక మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడే శ్రీనివాస్ తో సినిమా చేశాను.
దాని వెనుక చాలా కారణాలున్నాయి..
“లెజండ్” అనంతరం బెల్లంకొండ శ్రీనివాస్ తో మొదలుపెట్టిన సినిమా ప్రారంభోత్సవం తర్వాత ఆగిపోయింది, దాని వెనుక చాలా కారణాలున్నాయి. అయితే.. అప్పుడు అనుకొన్న కథ వేరు, ఇప్పుడు చేసిన కథ వేరు.
నన్ను నమ్మేవాళ్లున్నారు కాబట్టే అంత ఖర్చుపెట్టాను..
“బోయపాటి సినిమా” అనే బ్రాండ్ చూసి వచ్చే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ క్యాస్టింగ్ తో అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో “జయ జానకి నాయక” చిత్రాన్ని భారీగా రూపొందించాం.
వాళ్ళకోసం నా సినిమా ఆపుకోను..
నేను సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి నెలరోజులు పైనే అవుతుంది. బిజినెస్ అయిపోయి, నిన్న ఫారిన్ కి ప్రింట్స్ కూడా వెళ్లిపోయాయి. అలాంటి తరుణంలో వేరే 2 పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయని నా సినిమా పోస్ట్ పోన్ చేయమనడం ఎంతవరకూ సబబు.
డబుల్ ఒకే అయితే తప్ప సెట్స్ కు వెళ్లను..
నేను కథ సిద్ధం చేసుకొని డైలాగ్ వెర్షన్ మొదలుకొని షాట్ డీవియేషన్ వరకూ అన్నీ ఒకే అయ్యేవరకూ సెట్స్ కు వెళ్లను. అందుకే ఒన్స్ సినిమా మొదలయ్యాక నా సినిమా ఎక్కడా ఆగదు, యాక్టర్స్ అందరికీ ప్రతిరోజూ సీన్ ను వివరిస్తాను, అంతే కాకుండా ఆరోజు సీన్ కు తగ్గట్లు మూడ్ ను కూడా క్రియేట్ చేస్తాను, అందువల్ల ప్రతిఒక్కరూ బెస్ట్ అవుట్ పుట్ ఇస్తారు.
వెరీ పవర్ ఫుల్ రోల్ లో వాణీ విశ్వనాథ్..
వాణీ విశ్వనాధ్ డి అందరూ అనుకొంటున్నట్లు నెగిటివ్ రోల్, చాలా మంచి సపోర్టింగ్ రోల్. జగపతిబాబుకి సిస్టర్ రోల్ లో అద్భుతమైన పాత్రలో కనిపించనున్నారు వాణీవిశ్వనాధ్. ఆమె పాత్రకి మంచి వెయిట్ ఉంటుంది. చాలారోజుల తర్వాత ఆవిడ్ని స్క్రీన్ పై చూడడం ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విషయం.
జూనియర్ ఆర్టిస్ట్స్ అందరూ నా పేరు చెప్పుకొంటారు..
నా సినిమాలో దాదాపు ఒక 100 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులుంటారు. ప్రతి సీన్ లోనూ దాదాపుగా అందరూ ఉంటారు. నా సినిమాలో నటించడం వల్ల ఓ 90 రోజులపాటు వాళ్ళందరూ కడుపునిండా అన్నం తింటారు. నా పేరు చెప్పుకొని వాళ్ళందరూ సుఖంగా ఉండడం కంటే నాకేం కావాలి చెప్పండి.
ఆ ముగ్గురు స్టార్ హీరోల కథలు సిద్ధం..
నా నెక్స్ట్ సినిమాపై నాకే ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఆల్రెడీ బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబుల కోసం కథలు రెడీ చేశాను. అలాగే.. అఖిల్ కోసం కూడా ఒక స్టోరీలైన్ రెడీ చేశాను. “జయ జానకి నాయక” అనంతరం ఒక 8 నెలల గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ లో వేరే సినిమా చేయాలా లేక మార్చి/ఏప్రిల్ లో మొదలుపెట్టబోయే బాలకృష్ణగారి సినిమా కథకు మెరుగులు పెట్టాలా అనే విషయంపై నేను ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది.
– Dheeraj Babu
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.