Allu Arjun: ‘సరైనోడు’ కాంబో.. సెట్ అవుతుందా..?

  • May 11, 2021 / 06:13 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మాస్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఇమేజ్ బాగా దెబ్బతింది. ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ కావడంతో బోయపాటితో సినిమా చేయడానికి హీరోలు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్యని ఒప్పించి ‘అఖండ’ అనే సినిమా తీస్తున్నాడు బోయపాటి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమా భారీ విజయాలు అందుకోవడంతో ‘అఖండ’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత బోయపాటి.. యంగ్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు బోయపాటి.. బన్నీకి కథ చెప్పబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చేస్తోన్న అల్లు అర్జున్.. తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయాలనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. దీంతో బన్నీతో నెక్స్ట్ సినిమా చేయడానికి కొందరు దర్శకులు ప్రయత్నిస్తున్నారు.

వేణుశ్రీరామ్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు బన్నీని సంప్రదించారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బోయపాటి శ్రీను కూడా చేరినట్లు తెలుస్తోంది. ‘సరైనోడు’ సినిమా సమయంలోనే గీతాఆర్ట్స్.. బోయపాటితో మరో సినిమా చేయాలని అనుకుంది. అడ్వాన్స్ కూడా ఇచ్చేసింది. దీంతో బోయపాటి ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలనుకుంటున్నారు. గత రెండు వారాల్లో బోయపాటి పలు సార్లు అల్లు అరవింద్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం బోయపాటి.. బన్నీ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడు. స్క్రిప్ట్ రెడీగా ఉంటే బన్నీని కలిసి వినిపించబోతున్నాడు. మరి బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus