Brahmastra: అలా జరిగితే జక్కన్నకు భారీ నష్టమేనా?

  • September 1, 2022 / 01:09 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినా బ్రహ్మాస్త్ర సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున, అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.సెప్టెంబర్ నెల 2వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా తారక్ ఈ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానున్నారు.

రాజమౌళి బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ ను సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైతం దృష్టి పెట్టారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండింగ్ అవుతోంది. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండింగ్ అవుతుండటంతో ఈ సినిమా మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ మధ్య కాలంలో బాయ్ కాట్ అంటూ ట్రెండింగ్ లో నిలిచిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించడం, కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడంతో నెటిజన్లు ఈ సినిమాను టార్గెట్ చేశారని తెలుస్తోంది. హిందీతో పాటు దక్షిణాది భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తుండటంతో ఈ సినిమా సక్సెస్ సాధిస్తే జక్కన్నకు భారీస్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అయితే బాయ్ కాట్ ట్యాగ్ వల్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే మాత్రం మేకర్స్, రాజమౌళి భారీ మొత్తంలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమా పరిస్థితి మారే ఛాన్స్ అయితే ఉంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus