రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్రహ్మాజీ
November 29, 2018 / 10:13 AM IST
|Follow Us
దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి వచ్చే ఏడాది జనవరి 5 వ తేదీన అంగరంగ వైభవంగా జరుగనుంది. జక్కన్న ఒక పక్క ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ చేస్తూనే పెళ్లి పనులను కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నయ్య రామ్ ప్రసాద్ కుమార్తె ప్రియతో కార్తికేయ గత కొంతకాలం నుండి ప్రేమలో ఉండగా వీరి ప్రేమకి పెద్దలు అంగీకరించడంతో ఇద్దరు ఒకటవబోతున్నారు. శాస్రియ సంగీతంలో మంచి ప్రావిణ్యం ఉన్న ప్రియ కొన్ని భక్తి గీతాలను పాడి మంచి పేరు సంపాదించుకుంది.
ఇక వీరి పెళ్లి విషయంపై నటుడు బ్రహ్మాజీ ఆసక్తికర ట్వీట్స్ చేసాడు. ఈ రోజుల్లో పెళ్లి అంటే మ్యానేజర్స్ తో ఇన్విటేషన్స్ పంపడం లేదా ఫోన్లో, వాట్సాప్ లోనే ఇన్వైట్ చేస్తున్నారు. కానీ రామ రాజమౌళి గారు స్వయంగా తానె ఇంటికి వచ్చి మరి శుభలేఖ ఇచ్చి పెళ్ళికి ఆహ్వానించింది. మీరు అందరిలా కాకుండా ఇంటికి వచ్చి మరి శుభలేఖ ఇచ్చి పిలిచిన మీకు చాలా థాంక్స్ అంటూ బ్రహ్మాజీ ట్వీట్ చేసాడు. రాజమౌళి గారి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసిన బ్రహ్మజీకి, రాజమౌళి కి ఎప్పటినుండో మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం మనకి తెలిసిందే. ఇక జనవరి 5 వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు జరిగే రాజమౌళి కొడుకు పెళ్ళికి అన్ని ఇండస్ట్రీస్ లోని ప్రముఖ సెలబ్రిటీస్ అందరు రాబోతున్నారు.