Brahmanandam: మీమ్స్ క్రియేట్ చేసేవాళ్లపై బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్!

  • November 23, 2021 / 07:51 PM IST

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు గెస్ట్ గా హాజరు కాగా తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. నవంబర్ 29వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా బ్రహ్మానందం తనదైన శైలిలో సమాధానాలు చెప్పి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేశారు. అలీ ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? ఎక్కడ చదివారు? ఎక్కడ సెటిల్ అయ్యారు? అని బ్రహ్మానందంను అడగగా నవ్వుతూ ఎందుకురా ఇవన్నీ అంటూ బ్రహ్మానందం సమాధానం ఇచ్చారు.

మనం ఎక్కడ కలిశామో తెలుసా అంటూ బ్రహ్మానందంను అలీ ప్రశ్నించగా అల్లు రామలింగయ్య గారు చంటబ్బాయ్ సినిమా షూటింగ్ సమయంలో అలీని పరిచయం చేశారని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. జంధ్యాల ఎక్కడ పరిచయమనే ప్రశ్నకు బ్రహ్మానందం స్పందిస్తూ తన దగ్గర నవ్వించే శక్తి ఉందని గుర్తించిన వ్యక్తి జంధ్యాల అని బ్రహ్మానందం కామెంట్లు చేశారు. తాను మొదటిసారి చిరంజీవితో కలిసి విమానం ఎక్కానని బ్రహ్మానందం తెలిపారు. తనను బ్రహ్మానందం అని పిలిచినా హ్యాపీనే అని బ్రహ్మిగాడు అని పిలిచినా హ్యాపీనే అని బ్రహ్మానందం అన్నారు.

మీమ్స్ ను క్రియేట్ చేసేవాళ్లకు తాను చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని బ్రహ్మానందం అన్నారు. కొన్ని రీజన్స్ వల్ల తాను సినిమాలలో నటించలేకపోయినా మీమర్స్ తనను మరిచిపోకుండా చేశారని బ్రహ్మానందం పేర్కొన్నారు. వివాహ భోజనంబు మూవీలో తాను ఇసుకలో ఫీకల్లోతు దిగిపోయి నటించానని షాట్ గ్యాప్ లో ఇసుకలో ఉన్న సమయంలో కుక్క అక్కడికి వచ్చిందని కుక్క ఏదో అనుకుని కాలు ఎత్తుతుందేమోనని భయపడ్డానని బ్రహ్మానందం కామెంట్లు చేశారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus