Brahmastra Frist Review: ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 6, 2022 / 06:39 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ కాబోతుంది. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ మూవీ మొద‌టి భాగం శివ‌ థీమ్ తో తెరకెక్కింది. స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం.. నాగార్జున ఓ కీలక పాత్ర చేయడం అలాగే చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ మూవీ ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో పాటు జనాలను థియేటర్లకు రప్పించి మంచి ఓపెనింగ్స్ ను కూడా రాబట్టలేకపోతున్నాయి. ఇలాంటి టైంలో బ్రహ్మాస్త్ర అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరుగుతుండటం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది. ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, సినీ క్రిటిక్ అయిన ఉమైర్ సందు ‘బ్రహ్మాస్త్ర’ ని వీక్షించి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. అతని రివ్యూ ప్రకారం చూస్తే :

1) ‘బ్రహస్త్ర’ అన్ని విధాలుగా పెద్ద సినిమా.., పెద్ద స్టార్స్, పెద్ద కాన్వాస్, వి.ఎఫ్.ఎక్స్ కోసం పెద్ద ఖర్చు, భారీగా పబ్లిసిటీ చేసిన సినిమా, భారీగా అంచనాలు సృష్టించిన సినిమా. అలాగే ఇది భారీగా నిరాశపరిచే సినిమా కూడా!

2) ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి సోల్ అంటూ లేదు. సినిమాకి భారీగా పబ్లిసిటీ చేశారు కాబట్టి మొదటి వీకెండ్ కు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టొచ్చు. కానీ ప్రేక్షకులను కట్టిపడేయడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైంది కాబట్టి బాక్సాఫీస్ వద్ద జోరు తొందరగానే ముగిసిపోతుంది.

3)మెరిసేదంతా బంగారం కాదు అనడానికి ‘బ్రహ్మాస్త్ర’ ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు.

4)బాలీవుడ్‌లో ఫాంటసీ లేదా అడ్వెంచరస్ సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి జోనర్ ను టచ్ చేయాలనే ప్రయత్నం చేసినందుకు దర్శకుడు అయాన్‌ ముఖర్జీని అభినందించాలి. కానీ ‘బ్రహ్మాస్త్ర’ లో కథ, స్క్రీన్ ప్లే చాలా యావరేజ్ గా గందరగోళానికి గురి చేసే విధంగా ఉన్నాయి !

5) బ్రహ్మాస్త్ర విషయంలో హీరో రణబీర్ కపూర్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు! సినిమాలో కూడా ఏం జరుగుతుందో తెలీనంత కన్ఫ్యుజింగ్ గా అతని పాత్ర ఉంటుంది. అలియా భట్ సినిమాలో బాగుంది! ఆమె లుక్స్ తో వావ్ అనిపించే విధంగా ఉంది. మౌని రాయ్ కూడా బాగా నటించింది! అమితాబ్ బచ్చన్ సూపర్ గా కనిపించారు. కాకపోతే ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉంది.

6) వి.ఎఫ్.ఎక్స్ విషయంలో ‘బ్రహ్మాస్త్ర’ పెద్దగా ఆకట్టుకోదు. రెండు సీక్వెన్స్ లు మాత్రం బాగున్నాయి.

7) ఇక సినిమా గురించి మొత్తం చెప్పి 2.5/5 రేటింగ్ ఇచ్చాడు ఉమైర్. అంతేకాదు ఇది ‘స్ట్రిక్ట్లీ యావరేజ్’ సినిమా అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

8) నిజానికి ఉమైర్ సంధు ప్రతి సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇస్తుంటాడు. ఇతను పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చిన సినిమాలు చాలా వరకు ప్లాప్ అయ్యాయి.

9) అలాంటి ఉమైర్ సంధు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి నెగిటివ్ గా రివ్యూ ఇవ్వడం అందరికీ షాకిచ్చింది. ఈ మధ్యనే వచ్చిన ‘లైగర్’ ‘ఆచార్య’ వంటి చిత్రాలకు కూడా సూపర్ హిట్ రివ్యూలు ఇచ్చాడు ఉమైర్ సంధు.

10) అయితే ఉమైర్ సందు రివ్యూల పై జనాలకు పెద్దగా నమ్మకం ఉండదు. కానీ అతను బాగుంది అని రివ్యూ ఇస్తేనే కొన్ని సినిమాలు చాలా ఘోరంగా ఉంటాయి. మరి ఈ సినిమాకి యావరేజ్ అనే టాక్ చెప్పడంతో సినిమా ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus