Brahmastra Review: బ్రహ్మాస్త్రం పార్ట్ 1: శివ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 9, 2022 / 07:20 PM IST

కనీస స్థాయి విజయాన్ని అందుకోవడం కోసం నానా పాట్లు పడుతున్న బాలీవుడ్ నుండి వచ్చిన తాజా చిత్రం “బ్రహ్మాస్త్రం”. హిందీలో తెరకెక్కి.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని సౌత్ లో రాజమౌళి సమర్పించడమే కాక.. ప్రచారకర్తగా వ్యవహరించడం విశేషం. మరి ఈ సినిమాతోనైనా బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందో లేదో చూద్దాం..!!

కథ: గత కొన్ని దశాబ్ధాలుగా “బ్రహ్మాస్త్రాన్ని” కాపాడుతూ వస్తారు కొందరు అతీత శక్తుల సమూహం. ఆ సమూహానికి నాయకుడు గురు (అమితాబ్ బచ్చన్). జునూన్ (మౌనిరాయ్) చేతికి బ్రహ్మాస్త్రం అందకుండా చేయడమే ఈ సమూహం లక్ష్యం. అయితే.. ఆ బ్రహ్మాస్త్రాన్ని కాపాడగలిగేది శివ (రణబీర్ కపూర్) మాత్రమే అని తెలుసుకొంటారు. ఓ సాధారణ యువకుడైన శివ.. ఈ అతీత శక్తులను ఎలా ఎదుర్కొన్నాడు? బ్రహ్మాస్త్రాన్ని చెడు శక్తుల బారి నుండి ఎలా కాపాడాడు? అనేది “బ్రహ్మాస్త్రం” కథాంశం.

నటీనటుల పనితీరు: రణబీర్, ఆలియా, అమితాబ్, నాగార్జున.. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అన్నట్లు కాకుండా.. అందరూ సమానమైన పద్ధతిలో నటించారు.

సాంకేతికవర్గం పనితీరు: గ్రాఫిక్స్ సినిమాకి పెద్ద మైనస్. ఒక యానిమేషన్ సినిమా తరహాలో గ్రాఫిక్స్ ఉండడం అనేది సినిమాతో సింక్ అవ్వలేదు. “బాహుబలి, కేజీఎఫ్” లాంటి సినిమాలను చూసిన ఆడియన్స్.. గ్రాఫిక్స్ & 3D అంటే ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఎక్స్ పెక్ట్ చేయడం అనేది కామన్. కానీ.. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కానీ ఎస్.ఎఫ్.ఎక్స్ కానీ ఆడియన్స్ ను సంతృప్తిపరచలేవు. అయిదుగురు సినిమాటోగ్రాఫర్స్ కలిసి కూడా కెమెరా వర్క్ విషయంలో చేతులెత్తేయడం అనేది ఎవరూ ఊహించని విషయం. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ బాగుంది.

దర్శకుడు అయాన్ ముఖర్జీ దాదాపు 8 ఏళ్లపాటు కష్టపడి.. ఎన్నో పుస్తకాలు చదివి, హిందూత్వాన్ని అర్ధం చేసుకొని ఈ సినిమా కథను రాయడం అనే విషయాన్ని మెచ్చుకోవాల్సిన అంశం అయినప్పటికే.. తాను తెలుసుకున్న విషయాలన్నీ ఒకేసారి ఆడియన్స్ బుర్రలోకి కుక్కడానికి ప్రయత్నించిన విధానమే సినిమాకి పెద్ద మైనస్ గా మారింది. స్క్రీన్ ప్లే పరంగా కనీస స్థాయి జాగ్రత్త కూడా తీసుకోలేదు అయాన్. అందువల్ల ఆడియన్స్ సినిమాలో క్యారెక్టర్స్ కి కానీ.. కథనానికి కానీ కనెక్ట్ అవ్వలేకపోయారు. సో, కథకుడిగా పర్వాలేదనిపించుకున్న అయాన్.. దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.

విశ్లేషణ: భీభత్సమైన స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్ వంటివన్నీ ఉన్నప్పటికీ.. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో చతికిలపడిన సినిమా “బ్రహ్మాస్త్రం”. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలన్న బాలీవుడ్ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు!

రేటింగ్: 2/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus