Brahmastra: లాభాలు రావడం వల్లే బ్రహ్మాస్త్ర2, బ్రహ్మాస్త్ర3 తెరకెక్కుతున్నాయా?

  • October 1, 2022 / 01:56 PM IST

ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన సినిమాలలో బ్రహ్మాస్త్రం ఒకటనే సంగతి తెలిసిందే. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మరే సినిమా నుంచి పోటీ లేకపోవడం తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనడం, రాజమౌళి ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయడం ఈ సినిమాకు ప్లస్ అయింది. జక్కన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రం2, బ్రహ్మాస్త్రం3 సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్లను తాజాగా వెల్లడించారు. 2025 సంవత్సరం దీపావళి పండుగ కానుకగా బ్రహ్మాస్త్రం2 సినిమాను రిలీజ్ చేయనున్నామని 2026 సంవత్సరం క్రిస్మస్ కానుకగా బ్రహ్మాస్త్రం3 సినిమాను రిలీజ్ చేయనున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ తేదీలకే సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో పరిస్థితులకు అనుగుణంగా ఈ తేదీలలో మార్పు ఉండవచ్చని ఆయన వెల్లడించడం గమనార్హం.

బ్రహ్మాస్త్ర పార్ట్1 నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించడంతో బ్రహ్మాస్త్రం పార్ట్2, బ్రహ్మాస్త్రం పార్ట్3 దిశగా అడుగులు పడుతున్నాయి. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో నాగ్ అభిమానులు బ్రహ్మాస్త్రం సినిమాను థియేటర్లలో చూశారు. అతి త్వరలో ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. బ్రహ్మాస్త్రం సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఓటీటిలో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కళ్లు చెదిరే మొత్తాన్ని ఆఫర్ చేసి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని బోగట్టా. బ్రహ్మాస్త్రం2, బ్రహ్మాస్త్రం3 సినిమాలలో మరిన్ని ప్రత్యేకతలు ఉండేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా. బ్రహ్మాస్త్రం2 సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనుందని తెలుస్తోంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus