Dasara: నాని సినిమా బడ్జెట్ పెరిగిపోయిందట!

  • February 7, 2023 / 06:27 PM IST

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘దసరా’. ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్స్ లో ఒకరైన నాని సినిమాల కోసం సాధారణంగా అయితే రూ.30 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తుంటారు. అంత బడ్జెట్ పెడితే రూ.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగేది. ఆ విధంగా నిర్మాతలు లాభపడేవారు. అయితే ఈ మధ్యకాలంలో నానికి సరైన హిట్టు పడలేదు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అంటే సుందరానికీ’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా మాత్రం వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ నాని లేటెస్ట్ సినిమా ‘దసరా’కి రూ.35 కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఆయన తన గత చిత్రాలతో ఎఫెక్ట్ అయినప్పటికీ.. ఈ సినిమా మీద భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే ఒక సినిమా మొదలయ్యే ముందు ఇంతలో సినిమా చేయాలని అనుకోవడం, ఆ తరువాత బడ్జెట్ పెరిగిపోవడం కామన్.

మహా అయితే ఐదు నుంచి పది కోట్ల రేంజ్ లో దర్శకులు బడ్జెట్ పెంచేసే ఛాన్స్ ఉంది. కానీ ‘దసరా’ సినిమాకి ఏకంగా బడ్జెట్ డబుల్ అయిపోవడం షాకింగ్ గా ఉంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లానింగ్ ప్రకారం సినిమా తీయలేకపోయారా..? లేక క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని.. బడ్జెట్ పెంచేశారా..? అనేది తెలియదు కానీ.. బడ్జెట్ ముందు అనుకున్నదానికంటే రెట్టింపు అయిందట. అందుతున్న సమాచారం ప్రకారం.

. ‘దసరా’కి ఏకంగా రూ.65 కోట్లు ఖర్చు చేశారట. నాని ఒక్కడికే రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. అలానే హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకున్నారు. ఆమెకి కూడా భారీ మొత్తాన్నే రెమ్యునరేషన్ గా ఇచ్చారు. సినిమాలో పేరున్న ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. అలానే టాప్ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు. ఇక సినిమా బిజినెస్ కూడా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అన్ని హక్కులు కలిపి రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus