Pushpa2, Salaar: పుష్ప2 వర్సెస్ సలార్.. ఆ రికార్డ్ ఎవరి సొంతమో?

  • April 12, 2023 / 11:32 AM IST

ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన సలార్ మూవీ రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పుష్ప2 సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా థియేటర్లలో రిలీజ్ కానుండగా సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తే పుష్ప2 సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు.
ఈ రెండు సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి అతి త్వరలో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సలార్, పుష్ప2 సినిమాలలో ఏ సినిమాను తక్కువగా అంచనా వేయలేమనే సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఇతర భాషల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రభాస్, బన్నీలకు ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా ఈ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం తక్కువ కాదు.

బిజినెస్ వార్ లో ఏ సినిమాను తక్కువగా అంచనా వేయలేం. ఈ రెండు సినిమాలకు వేర్వేరుగా 700 నుంచి 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాలు సాధించే కలెక్షన్ల గురించి కూడా హాట్ టాపిక్ అవుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటివరకు హై రేంజ్ లో ఉండగా ఆ రికార్డులను ఈ రెండు సినిమాలు సులువుగానే బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

(Pushpa2) పుష్ప2, సలార్ తమ ఫేవరెట్ హీరోల సినీ కెరీర్ లో బెస్ట్ సినిమాలుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్, బన్నీ ఈ ప్రాజెక్ట్ లపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మాస్ ప్రేక్షకుల్లో ఈ ఇద్దరు స్టార్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus