బాలయ్య సినిమా సెట్స్ లో ప్రకాష్ రాజ్ ను నిలదీసిన కెమెరామెన్

  • October 25, 2019 / 02:18 PM IST

ఇప్పుడంటే రావురమేష్ ఎంట్రీతో ప్రకాష్ రాజ్ కి పెద్దగా ఆఫర్లు ఉండడం లేదు కానీ.. “కొత్త బంగారు లోకం” ముందు వరకూ ప్రకాష్ రాజ్ కి తిరుగులేదు. అందుకే ఆయన సెట్స్ లో ఎవరి మీద అరిచినా, ఎవర్ని ఎన్ని తిట్టినా అందరూ మూసుకుని పడేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండాపోయింది. దాంతో.. రీసెంట్ గా బాలయ్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న “రూలర్” సెట్స్ లో సీన్ రెడీ అని అసిస్టెంట్ డైరెక్టర్ పిలిస్తే సెట్స్ లోకి వచ్చిన ప్రకాష్ రాజ్ అక్కడ ఇంకా కెమెరా యాంగిల్ సెట్ చేస్తుండడం చూసి.. సెట్ లో బాలయ్య ఉండగానే “అంతా రెడీ అయ్యాక నన్ను పిలవాలి కానీ.. ఇలా ముందు పిలవకూడదు” అని గట్టిగా అరిచాడట.

అయితే.. కెమెరామెన్ సి.రాంప్రసాద్ వెంటనే “ఇదేం మీ ఇల్లు కాదు.. కాస్త ఓపికగా ఉండండి” అని రిప్లై ఇచ్చారు. ఇది ఊహించని ప్రకాష్ రాజ్ కోపంతో సెట్స్ నుండి వెళ్లిపోయాడట. కానీ.. తనను పిలవడానికి మళ్ళీ ఎవరూ రాకపోవడంతో, కాసేపటికి మళ్ళీ తానే సెట్స్ కు వచ్చాడట. ఈ విషయంలో బాలయ్య కూడా కెమెరామెన్ రాంప్రసాద్ కి సపోర్ట్ చేయడంతో ప్రకాష్ రాజ్ ఏమీ చేయలేక తన సీన్ కంప్లీట్ చేసుకొని వెనుదిరిగాడట.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus