బిగ్‌బాస్ 4: కెప్టెన్సీ కోసం ఎవరెవరు ఏం చేశారంటే?
September 30, 2020 / 09:21 AM IST
|Follow Us
ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు ఎవరు అనే విషయాన్ని తేల్చడానికి బిగ్‌బాస్ ‘కిల్లర్ కాయిన్స్’ అనే టాస్క్ ఇచ్చాడు. గాల్లోంచి వచ్చే కాయిన్స్‌ను ఎవరు ఎక్కువగా సేకరిస్తారనేదే ఈ టాస్క్. ఇందులో అత్యధిక కాయిన్స్ సంపాధించిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని బిగ్‌బాస్ తెలిపారు. దీంతో హౌస్మేట్స్ దెబ్బలు తిని మరీ టాస్క్‌లో ఆడే ప్రయత్నం చేశారు.
టాస్క్ అంటే యాక్టివ్‌గా ఉండదు అనే అపవాదు చెరుపుకోవడానికేమో… ఈ రోజు దివి చాలా యాక్టివ్‌గా కనిపించింది. ఆమె కాయిన్స్ ఏరుతూనే కుమార్ సాయి, అభిజీత్ కాయిన్స్‌ని దొంగిలించింది. ఈ విషయంలో దివికి అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఫుల్ సపోర్టు ఇచ్చాడు.
టాస్క్ విషయంలో జాగ్రత్తగా ఆడండి అని బిగ్‌బాస్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఈ సారి కూడా అదే పని చేశాడు. అయితే హౌస్‌లో వర్షం పడటం వల్ల అందరూ జారిపడ్డాడు. సుజాత కాలు, చేతులకు దెబ్బలు కూడా తగిలాయి. ఇంకొందరికి బయటకు కనిపించని గాయాలయ్యాయి. మరి బిగ్‌బాస్ ఏమనకుండా ఊరుకున్నాడు ఎందుకో.
ఈ టాస్క్‌లోనూ సోహైల్ మళ్లీ హైలైట్ అయ్యాడు. ఆరియానా కలెక్ట్ చేసిన కాయిన్స్‌ను కొట్టేసి… తర్వాత ఇచ్చేశాడు. ఈ సమయంలో దివి వచ్చిన ‘దొంగ’ అనే టాపిక్ తెచ్చింది. దీంతో సోహైల్ ఫైర్ అయ్యాడు. ‘నువ్వు కుమార్‌సాయి దగ్గర కొట్టేయలేదా’ అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ చర్చ కొనసాగింది. మధ్యలో సుజాత వచ్చి సర్దిచెప్పబోతే ఆమె మీద కూడా సోహైల్ అరిచేశాడు.
ఒక్కొక్కరు ఆడండి.. అని బిగ్‌బాస్ చెబితే ఇంట్లో వాళ్లు కూటములుగా ఏర్పడి ఆట ఆడారు. అఖిల్ – మోనాల్, అమ్మ రాజశేఖర్ – దివి, సోహైల్- మెహబూబ్… ఇలా జంటలుగా విడిపోయి ఆడారు. దీంతో బిగ్‌బాస్ మధ్యలో ఆటను సరిగా ఆడండి అని సూచించాడు. దీంతో మళ్లీ ఆటలో వేడి పెరిగింది. కాయిన్స్ పడటం ఆగినప్పుడు ఒకరు దాచిన కాయిన్స్ మరొకరు కొట్టేశారు. హారిక దాచుకున్న కాయిన్స్‌ను దొంగిలిస్తూ సోహైల్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. కానీ హారిక చాలా కూల్‌గా తీసుకుంది. ఈ టాస్క్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎన్ని దొంగతనాలు, ట్విస్టులు ఉంటాయో.
గత సీజన్లలో కూడా బిగ్‌బాస్ ఇలాంటి ఆటలు ఆడించాడు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. అయితే ఇప్పటిలాగా చిన్న పిల్లల్లా… ఫెయిర్ గేమ్ కాన్సెప్ట్, దొంగతనం చేయకు, కూటములు లాంటివి జరగలేదు. కానీ ఈ సారి అవి కనిపిస్తున్నాయి. అయితే ఇంట్లో ఎవరి రంగేంటే స్పష్టంగా తెలిసిపోయింది. సోలోగా గేమ్ ఆడుతున్నది ఎవరు? ఇంకొకరి మీద ఆధారపడుతున్నది ఎవరు లాంటివి స్పష్టంగా తెలిసిపోయాయి.