‘కన్యాదానం’ ‘ఒకే మాట’ ‘సెల్యూట్'(బైలింగ్యువల్) ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఉపేంద్ర అంతకు ముందు హీరోగా ‘ఉపేంద్ర’ ‘రా’ వంటి బోల్డ్ సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో కూడా ఇవి సక్సెస్ అయ్యాయి.ఉపేంద్ర సినిమాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. అప్పటి యూత్ కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఉంటాయి అని చెప్పొచ్చు. అసలైన బోల్డ్ నెస్ ను ప్రేక్షకులకి రుచి చూపించింది ఉపేంద్ర ..
అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ కేసులో ఇరుక్కోవడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో అతని పై ఎఫ్. ఐ.ఆర్ కూడా ఫైల్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉపేంద్ర తాజాగా తన ప్రజాకీయ పార్టీ గురించి ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడాడు. ఈ టైంలో అతను బ్యాలన్స్ తప్పి దళిత కమ్యూనిటీ పై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
అతను మాట్లాడుతూ ..’ అమాయక హృదయం ఉన్న వారిలో మాత్రమే మార్పు జరుగుతుంది. అలాంటి నిష్కళంకమైన హృదయం ఉన్నవారు మాత్రమే మాతో కలవండి. మీ మనసులో ఉన్న బాదని మాకు నేరుగా చెప్పండి.ఇలాంటివే మేము కోరుకుంటున్నాం. వారి సూచనలు కూడా మాకు మేలు చేస్తాయి.వారు నిర్లక్ష్యంగా మాట్లాడరు.ఇంకొకరిని అవమానించరు.కొందరికి బోలెడు టైం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు, నచ్చిన విధంగా మాట్లాడతారు.
ఓ ఊరు ఉంటే అందులో దళితులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ” అంటూ ఉపేంద్ర కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు నిరసన వ్యక్తం చేశారు. ఉపేంద్ర దీనికి క్షమాపణలు చెప్పినా వారు ఆగడం లేదు. అందుకే (Upendra) ఉపేంద్ర పై కేసు నమోదైనట్లు తెలుస్తుంది.