హద్దులు మీరినందుకు ప్రదీప్ ను అరెస్ట్ చెయ్యాలి..!

  • February 3, 2020 / 06:24 PM IST

మేల్ యాంకర్స్ లో నెంబర్ 1 యాంకర్ అయిన ప్రదీప్ ఓ పక్క యాంకర్ గా రాణిస్తూనే మరో పక్క కొన్ని సినిమాల్లో కూడా మెరుస్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఈ యాంకర్ నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈయన మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రదీప్ పై ఓ యువ దర్శకుడు కేసు పెట్టడం పెద్ద సంచలనంగా మారింది. ప్రదీప్ హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబందించిన ఎనౌన్స్మెంట్ రావడంతో పాటు ఓ పాటని సైతం విడుదల చేశారు.

అయితే.. గతంలో ఓ అమ్మాయిని వేధిస్తున్నాడు అంటూ ప్రదీప్ ఓ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రెండు రోజులు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ‘సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌’ రూల్స్‌ కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ఈ విధంగా ప్రవర్తించినందుకు ఆ చిత్రం షూటింగ్ ఆపేసారట. ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం చేస్తుండడంతో వెంటనే అడ్డుకోవాలని, ప్రదీప్ నటించకుండా చూడాలని మేడ్చల్‌ జిల్లా రాంపల్లికి చెందిన శ్రీ రామోజు సునిశిత్‌ అనే యువ దర్శకుడు బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ప్రదీప్‌ తో పాటు సినీ దర్శకుడు కూడా నిబంధనలను అతిక్రమించాడని ఆరోపిణలు వ్యక్తం చేసాడు. తక్షణమే షూటింగ్‌ ఆపాల్సిందిగా కోరాడు. కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు వెంటనే విచారణ చేపడతాం అని తెలిపినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus