స్టార్ యాంకర్ గా రాణిస్తున్న శ్రీముఖి.. ఇప్పుడు వరుస షో లతో బిజీగా గడుపుతుంది. కెరీర్ ప్రారంభంలో ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్ మెన్'(నాని జెంటిల్ మెన్) వంటి సినిమాల్లో నటించిన శ్రీముఖి … సడన్ గా సినిమాలు మానేసింది. అయితే ‘పటాస్’ షోతో ఈమె మరింతగా పాపులర్ అయ్యింది. శ్రీముఖి అనే పెరు కంటే రాములమ్మ అనే నిక్ నేం తోనే బాగా పాపులర్ అయ్యింది అని చెప్పాలి. గత ఏడాది బిగ్ బాస్ లో కూడా ఈ బ్యూటీ ఓ కంటెస్టెంట్ గా వచ్చి రన్నరప్ గా నిలిచింది.
విన్నర్ రాహుల్ తో మొదటి నుండీ గొడవలు పెట్టుకోవడం వంటి కారణంతోనే ఈమె విన్నర్ కాలేదు అనే కామెంట్స్ ఇప్పటికీ వినిపిస్తునే ఉంటాయి. ఈమె ఎంత ఎనర్జీ తో షో ని రక్తికట్టించినా .. ఒక్కోసారి ఈమె కొన్ని చెయ్యకూడని కామెంట్స్ చేస్తుంటుంది అని బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది చెప్పారు. హోస్ట్ నాగార్జున కూడా ఓ సందర్భంలో అన్నారు కూడా. అలాంటి సందర్భమే.. ఇప్పుడొకటి ఎదురైనట్టుంది. శ్రీముఖి పై కేసు నమోదు అయ్యేంత వరకూ వెళ్ళింది విషయం.
అవును శ్రీముఖి ఇటీవల ఓ షోలో చేసిన కామెంట్స్ … బ్రాహ్మణులను కించ పరిచేలా ఉన్నాయి అని… నల్లకుంటకు శర్మ అనే వ్యక్తి బంజార హిల్స్ పోలిస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసాడు. శర్మ ఫిర్యాదు మేరకు యాంకర్ శ్రీముఖితో పాటు జెమిని టీవీ ఛానల్ వారి పై కూడా పోలీసులు కేసు నమోదు చేసారట. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయం పై శ్రీముఖి ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు శ్రీముఖి అభిమానులు కూడా ఆందోళన చెందుతుంన్నట్టు సమాచారం.