సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు..!
December 20, 2016 / 07:33 AM IST
|Follow Us
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన కళ్యాణ్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. సినిమా థియేటర్లలో జాతీయ గీతం ఆలపించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పవన్ అవమానించారని హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఇంతటి వివాదానికి దారి తీయడానికి అసలు పవన్ ఏమన్నారో తెలుసుకుందాం… కొన్ని రోజుల క్రితం ప్రతి సినిమా హాల్లోనూ షో మొదలవడానికి ముందు జాతీయ గీతం తప్పక ఆలపించాలి అనే సుప్రీం కోర్ట్ ఆదేశాన్ని జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం జనసేన అధినేత స్పందించారు.
‘కుటుంబంతో, స్నేహితులతో సినిమా చూస్తూ సరదాగా గడపాల్సిన సాయంత్రం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయంగా మారింది’ అంటూ నిరుత్సాహాన్ని ట్వీట్స్ ద్వారా తెలిపారు. ‘కేవలం సినిమా హాళ్లలోనే జాతీయ గీతం ఎందుకు పాడాలి?. ప్రతి రోజూ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు తమ విధులను జాతీయ గీతం ఆలపించి ఎందుకు మొదలుపెట్టవు, ప్రజలకు ఉదాహరణలుగా ఎందుకు నిలవవు? చట్టాలను చేసేవారు వాటి గురించి ప్రచారం చేసేవారు.. వారెందుకు ఆచరించరు? ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలవొచ్చు కదా..’ అంటూ గట్టిగా ప్రశించారు. ఆయన మాటలకు చాలా మంది మద్దతు తెలిపారు. హైకోర్టు న్యాయవాది జనార్దన్ గౌడ్ మాత్రం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.