రానా నిర్మించిన సినిమా పై కేసు నమోదవ్వడం ఇప్పుడు సంచలనం గా మారింది. వివరాల్లోకి వెళితే…. ఇటీవల ఓటిటిలో విడుదలైన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ, ‘జెర్సీ’ ఫేమ్ శ్ర ద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ‘క్షణం’ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కించాడు. జూన్ 25న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
‘పర్ఫెక్ట్ ఓటిటి కంటెంట్ ఉన్న సినిమా’.. అంటూ క్రిటిక్స్ సైతం ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించారు. ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి డిఫరెంట్ మూవీ తరువాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకులకు అందించిన మన రానా పై కూడా ప్రశంసలు కురిశాయి. అయితే తాజాగా ఈ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ.. రాకేష్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం పెద్ద చర్చకు దారి తీసింది. ‘శృంగార భరితమైన సన్నివేశాలు కలిగిన ఈ చిత్రంలోని పాత్రలకు.. దేవుళ్ళ పేర్లు పెట్టడం ఏంటి?’ అని అభ్యంతరం వ్యక్తం చేసాడు ఆ వ్యక్తి.
అంతేకాదు ‘హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని..వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేయాలి’ అంటూ కూడా కంప్లైంట్ లో పేర్కొన్నాడు. దీంతో ఈ చిత్రం యూనిట్ సభ్యులు కలవరపడుతున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ చిత్రం షూటింగ్ 2017లోనే కంప్లీట్ అయ్యింది. కానీ అప్పటి నుండీ అనేక ఆటంకాలు రావడంతో విడుదలకు నోచుకోలేకపోయింది. ఇప్పుడు విడుదలయ్యి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నా.. ఇంకా ఈ చిత్రానికి చిక్కులు మాత్రం తొలగడం లేదనే చెప్పాలి.
Click Here to Read Krishna And His Leela Movie Review
Most Recommended Video
మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!