హీరోయిన్ వనిత విజయ్ కుమార్ భర్త పై కేసు నమోదు..!

  • June 30, 2020 / 04:03 PM IST

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మరియు మంజుల పెద్ద కూతురు అయిన హీరోయిన్ వనిత విజ‌య్‌ కుమార్ జూన్ 27న దర్శకుడు పీట‌ర్ పాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. క్రైస్తవ మత పద్దతిలోనే వీరిద్దరి పెళ్లి జరిగింది. అయితే వనితకు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం.ఇక పీటర్ ‌కు కూడా ఇది రెండో పెళ్లి. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పీటర్ పాల్ మొదటి భార్య అయిన ఎలిజ‌బెత్ హెలెన్ కేసు పెట్టిందట.

ఆమెకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ రెండో పెళ్లి చేసుకున్నట్టు ఆమె కంప్లైంట్ లో పేర్కొందట. ‘నాకు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు.. కేవలం వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఏడేళ్ల నుండీ విడిగా ఉంటున్నాము.. అయినా కూడా ఇద్దరం చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదు’ అంటూ ఆమె వెల్లండించినట్టు తెలుస్తుంది.అయితే పీటర్ రెండో భార్య అయిన వ‌నిత మాత్రం ఎలిజబెత్ ను తప్పు పడుతూ కామెంట్స్ చెయ్యడం గమనార్హం. ‘పీటర్ మొదటి భార్య అయిన ఎలిజ‌బెత్ హెలెన్.. కేవలం డ‌బ్బు కోస‌మే ఈ డ్రామాలన్నీ ఆడుతుంది. నా భర్త పీటర్.. ఎలిజ‌బెత్ తో ఎనిమిదేళ్ల క్రిత‌మే విడిపోయాడు.

అలాంట‌ప్పుడు కేసు పెట్టడం ఏంటి? మా పెళ్లికి ముందే ఆమె కోటి రూపాయ‌ల భరణం ఇవ్వాలని మమ్మల్ని డిమాండ్ చేసింది. అయితే అంత పెద్ద ఎమౌంట్ ఇచ్చే రేంజ్ మాది కాదని ఆమెకు చెప్పాను. అందుకే పెళ్లయ్యేంత వరకూ సైలెంట్ గా ఉండి..పెళ్లైన తర్వాత లేనిపోని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కేసు పై మేము న్యాయ‌ప‌రంగానే గెలిచి తీరుతాము’ అంటూ వనిత చెప్పుకొచ్చింది.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20


Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus