చేనేత వస్త్రాలు ధరించిన మన సినిమా తారలు.. ఫోటోలు వైరల్…!
August 8, 2020 / 03:47 PM IST
|Follow Us
చేనేత కార్మికులకు అండగా నిలిచారు మన సినిమా తారలు. మన దేశ సంపదలో… చేనేత రంగం చాలా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దేశ ఔన్నత్యాన్ని, వైవిధ్యాన్ని, కళాత్మకతను శతాబ్దాలుగా కాపాడుతూ వస్తుంది ఈ రంగం.అయితే ఈ రంగాన్ని ఎక్కువగా ఎవ్వరూ పట్టించుకోరు అనే విమర్శలు కూడా ఉండనే ఉన్నాయి.ఈ క్రమంలో నిన్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కొంతమంది సినీ సెలబ్రిటీలు చేనేత వస్త్రాల్లో కనిపించి ఆకట్టుకున్నారు.ఆ వస్త్రాల్లో… నేతన్నలకు కొత్త స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసారు.
ఇక మన సినీ తారలు చేనేత వస్త్రాల్లో మెరిసిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తారలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి.
‘అసలు ఫ్యాషన్ మొదలయ్యిందే మన చేనేత కార్మికుల ద్వారా’ అంటూ మన సమంత చెప్పుకొచ్చింది
1
2
3
విజయ్ దేవరకొండ కూడా చేనేత వస్త్ర్రాల్లో దర్శనమిచ్చాడు.
1
2
చేనేత కార్మికులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనది అంటూ.. రష్మిక మందన చెప్పుకొచ్చింది.
1
2
నారాయణ్ పేట్ సిల్క్ కుర్తా ధరించి మన నాగ చైతన్య కూడా చేనేత కార్మికులకు మద్దతు పలికాడు.
లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా చేనేత చీరలో దర్శనమిచ్చి.. చేనేత కార్మికులకు మద్దతు పలికింది.
1
లాక్ డౌన్ టైం లో రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్ కూడా….మన దేశంలో ఉన్న చేనేత కార్మికులను గౌరవించాలి… వారికి అండగా నిలబడాలి అంటూ చెప్పుకొచ్చాడు.
‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ కూడా చేనేత వస్త్రాల్లో మెరిసింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా చేనేత వస్త్రాలు చాలా ప్రత్యేకమైనవి… అలాగే చాలా గొప్పవి అంటుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మరియు వివాదాల హీరోయిన్ ఆయిన కంగనా రనౌత్ కూడా చేనేత వస్త్రాల్లో మెరిసింది.
చేనేత కార్మికుల.. కళా నైపుణ్యం, సృజనాత్మకత ప్రపంచంలోనే ఎంతో ఉత్తమమైనది అంటుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.
చేనేత కార్మికులకు అండగా నిలబడాలి అంటూ పిలుపునిస్తుంది రుక్షార్ థిల్లాన్. ఈ భామ నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా ద్వారా పాపులర్ అయ్యింది
1
2
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చింది.