కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన భరత్ అనే నేను సినిమా ఈరోజు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. మహేష్ ముఖ్యమంత్రిగా అద్భుతంగా నటించి హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ సినిమాని చూసిన ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం అభినందనలు గుప్పిస్తున్నారు.
“ఓ కమర్షియల్ చిత్రంలో ప్రభుత్వ పాలన, సమాజంలో జరుగుతున్న విషయాల గురించి వివరించాలంటే చాలా ఆలోచించాలి. ఇందుకు దర్శకుడు కొరటాల శివను, మహేశ్‌బాబును అభినందిస్తున్నాను. సినిమా మొత్తంలో ప్రెస్ మీట్ సన్నివేశం అద్భుతంగా ఉంది. మహేశ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. నటీనటులు అందరూ బాగా నటించారు. అందరూ వారి వారి పాత్రల్లో సరిపోయారు.” – రాజమౌళి
“భరత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పాలన మొదలైంది. అభిమానులకు బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని ఇచ్చి హామీని నెరవేర్చారు. ముఖ్యమంత్రి పాత్రలో జీవించేశారు. తెరపై మీరెప్పుడూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు. నిజాయతీగా సినిమాను తీసినందుకు కొరటాల శివకు అభినందనలు” – వంశీ పైడిపల్లి
“ఇప్పటికే సినిమా బ్లాక్‌బస్టర్ అని టాక్ వస్తోంది. సినిమా భారీ విజయం సాధిస్తుందనిపిస్తోంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు”. – బీవీఎస్ రవి
“భారీ అంచనాలను అందుకునే స్థాయిలో ‘భరత్ అనే నేను’ ఉంది. ప్రెస్‌మీట్ సన్నివేశంలో మహేశ్ నటన ఆయన నటించిన సినిమాలకంటే భిన్నంగా అద్భుతంగా ఉంది” – సుధీర్ బాబు
“నిద్రపోవడానికి ప్రయత్నించా. కానీ సినిమా చూసేవరకు నిద్రపట్టదు అని అర్ధమయింది” – రాజ్‌తరుణ్.
అన్ని ఏరియాల నుంచి వస్తున్న స్పందన చూసి మహేష్ ఆనందించారు. నాలుగు భాషల్లో అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు, తమిళం, ఆంగ్లం, హిందీలో ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.