పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని చాటిన స్టార్స్!
May 31, 2022 / 11:55 AM IST
|Follow Us
ప్రేమ ఏ వయసులో పుడుతోందో.. ఎప్పుడు పుడుతుందో ఎవరూ చెప్పలేము. ఒక్కొక్కరిది ఒక్కో లవ్ స్టోరీ. ఆ కథలను మన స్టార్స్ వెండితెరపై మరింత అద్భుతంగా చెప్పారు. చెప్పడమే కాదు.. పాటిస్తున్నారు. ప్రేమకి, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదని స్టార్స్ నిరూపించారు. అటువంటి జంటలపై ఫోకస్..
తారక్ & లక్ష్మి ప్రణతి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (20 మే 1983 ) తనకంటే తొమ్మిదేళ్ల చిన్న అయిన లక్ష్మి ప్రణతి(18 మార్చి 1992 ) ని పెళ్లిచేసుకున్నారు.
రజనీకాంత్ & లతసూపర్ స్టార్ రజనీకాంత్, లతల అనుబంధం ప్రత్యేకం. వయసులో ఎనిమిదేళ్ల తేడా ఉన్నప్పటికీ ఆ విషయం గుర్తుకురాకుండా.. అన్యోన్యంగా జీవిస్తున్నారు.
అక్కినేని నాగార్జున & అమలకింగ్ అక్కినేనాగార్జున, అమల మధ్య తొమ్మిదేళ్ల తేడా ఉంది. 29 ఆగష్టు 1959 (age 58) న అక్కినేని నాగార్జున, 12 సెప్టెంబర్ 1968 (age 49) అమల పుట్టారు.
మహేష్ బాబు & నమ్రత బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్ థన్ నాకంటే నాలుగేళ్లు చిన్న అయిన మహేష్ బాబుని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పర్ఫెక్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్నారు.
కృష్ణ వంశీ & రమ్యకృష్ణ క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య వయసు తేడా ఎనిమిదేళ్లు ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు.
సైఫ్ అలీ ఖాన్ & కరీనా కపూర్ బాలీవుడ్ నటీనటులు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ మధ్య పదేళ్లా తేడా ఉంది. సైఫ్ అలీ ఖాన్
16 ఆగష్టు 1970 లో జన్మించారు. కరీనా కపూర్ 21 సెప్టెంబర్ 1980 న పుట్టారు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారు.
భాగ్యరాజ్ & పూర్ణిమ తమిళ నటుడు డైరక్టర్ భాగ్యరాజ్ తనకంటే ఏడేళ్ల చిన్న అయిన పూర్ణిమని పెళ్లిచేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు.
ఆమిర్ ఖాన్ & కిరణ్ రావు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ( 14 మార్చి 1965 ) తన కంటే తొమ్మిదేళ్ల చిన్న అయిన కిరణ్ రావు (7 నవంబర్ 1973 )ను పెళ్లి చేసుకున్నారు.
అజిత్ కుమార్ & షాలిని తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (1 మే 1971 ), షాలిని (20 నవంబర్ 1979 ) ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య వయసు తేడా తొమ్మిదేళ్లు.
అభిషేక్ బచ్చన్ & ఐశ్వర్యారాయ్ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ తనకంటే మూడేళ్లు చిన్న అయిన అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
శరత్ కుమార్ & రాధికా తమిళం, తెలుగులో పాపులర్ నటీనటులుగా పేరు తెచ్చుకున్న శరత్ కుమార్, రాధికల మధ్య వయసు తేడా ఎనిమిదేళ్లు. అయినా వారి అనుబంధం చూస్తుంటే అంతా గ్యాప్ ఉందని ఎవరికీ అనిపించదు.
రామ్ చరణ్ & ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన కంటే నాలుగేళ్లు పెద్దది అయిన ఉపాసనను పెళ్లిచేసుకున్నారు. ఇప్పటికీ కొత్తగా ప్రేమలో పడిన ప్రేమ జంటల కనిపిస్తుంటారు.
ధనుష్ & ఐశ్వర్య తమిళ యువ హీరో ధనుష్ థన్ నాకంటే ఒక సంవత్సరం పెద్ద అయిన ఐశ్వర్య ని వివాహమాడారు.
రితేష్ దేశ్ ముఖ్ & జెనీలియా బబ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న జెనీలియా తనకంటే తొమ్మిదేళ్లు పెద్ద అయిన రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది.
రోజా & సెల్వమణి నటి రోజా తనకంటే ఏడేళ్లు పెద్ద వాడైనా సెల్వమణి ని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వయసు తేడాని పక్కనపెట్టి ఆనందంగా బతుకుతున్నారు.
ప్రియాంక చోప్రా & నిక్ జోనస్
బాలీవుడ్ నటీ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మధ్య పదేళ్లా తేడా ఉంది. ప్రియాంక చోప్రా 18 జులై 1982 లో జన్మించారు. నిక్ జోనస్ 16 సెప్టెంబర్ 1992 న పుట్టారు. ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లిచేసుకున్నారు.
మేము మిస్ చేసిన జంటలు మీకు తెలిసి ఉంటే.. కామెంట్ చేయండి.