వెబ్ సిరీస్ కి సెన్సార్ తప్పదట!

  • February 11, 2021 / 03:24 PM IST

లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్ల కంటే ముందే ఓటీటీలో సినిమాలు విడుదల అయిపోతున్నాయి. ఇక వెబ్ సిరీస్ లైతే ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంది. అయితే ఓటీటీలకు సెన్సార్ లేకపోవడంతో బూthu కంటెంట్ ఎక్కువైపోతుంది. బోల్డ్ సన్నివేశాలు, సెex సీన్స్ చూపించడంలో అసలు మొహమాట పడడం లేదు. యూత్ ని టార్గెట్ చేస్తూ క్యాష్ చేసుకుందామనుకుంటున్న ఈ ఓటీటీ సంస్థలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఓటీటీ ఛానెల్స్ లో ఉంటోన్న బూthu కంటెంట్ కి కత్తెర్లు వేయాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఓ గైడ్ లైన్స్ ని సిద్ధం చేసింది. అయితే సినిమాల మాదిరిగా.. ఓటీటీలో వచ్చే కంటెంట్ ని సెన్సార్ చేయడం అంత సులువైన పని కాదు. సెన్సార్ కి సంబంధించి ఒక్కో రాష్ట్రంలో నిబంధనలు ఒక్కోలా ఉంటాయి. పైగా వందల సంఖ్యలో వస్తోన్న కంటెంట్ ని సెన్సార్ చేయడం ఈజీ కాదు. అందుకే ఓటీటీ సంస్థలే స్వయంగా సెన్సార్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఈ షరతులకు అంగీకరించి స్వీయ సెన్సార్ చేసుకోవడానికి ముందుకొచ్చాయి.

ఇవి కాకుండా మరిన్ని ఓటీటీ సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా స్వీయ సెన్సార్ కి అంగీకరిస్తాయా..? ఒకవేళ అంగీకరించినా.. ఎంతవరకు నిజాయితీగా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆన్లైన్ లో వచ్చే కంటెంట్ ని కంట్రోల్ చేయడం కష్టమనే విషయం కేంద్రానికి కూడా తెలుసు. యూట్యూబ్ విషయంలో కూడా ఎన్ని రూల్స్ పెట్టినా.. బోల్డ్ కంటెంట్ ని మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. మరి ఓటీటీ కంటెంట్ ని కంట్రోల్ చేయడానికి ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తారేమో చూడాలి. మొత్తానికి వెబ్ సిరీస్ లకు ఇకపై సెన్సార్ తప్పదనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus