Chalaki Chanti: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే..! సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడా..?
October 9, 2022 / 12:14 AM IST
|Follow Us
బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం చంటి ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముగ్గురిని సేఫ్ చేశాడు. వీళ్లలో ఆదిరెడ్డి, ఫైమా, ఇంకా బాలాదిత్య ఉన్నారు. నిజానికి బాలాదిత్య డేంజర్ జోన్ లో ఉన్నాడు. అలాగే చంటి, ఇంకా మెరీనాలు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఈవారం ఆసక్తికరమైన ఎలిమినేషన్ ఉండబోతోందని ముందుగానే అందరూ ఊహించారు. అనుకున్నట్లుగానే చంటి ఈసారి ఎలిమినేట్ అయిపోయాడు. అయితే, ఇది హౌస్ మేట్స్ కి షాకింగానే ఉండచ్చు.
కానీ, చంటి ఫస్ట్ నుంచీ డిస్సపాయింట్ గానే హౌస్ లో ఉన్నాడు. తను ఏదైనా లాజిక్స్ వర్కౌట్ చేస్తూ గేమ్ ఆడాడు. గీతు – చంటి ఇద్దరూ కలిసి నామినేషన్స్ లోకి వచ్చినపుడు 100 శాతం నామినేషన్స్ కి వెళ్తాను అని చెప్పాడు. అంతేకాదు, ఈసారి నా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతానని చెప్పాడు. నామినేషన్స్ లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బర్త్ డే ఎంటర్ టైన్మెంట్ టాస్క్ లో కూడా పెద్దగా చంటి హైలెట్ అవ్వలేదు.
ఆర్జే సూర్య, రేవంత్, ఫైమా ఎంటర్ టైన్మెంట్ లో శభాష్ అనిపించుకుంటే, చంటి వెనకబడిపోయాడు. అంతేకాదు, ఫస్ట్ వీక్స్ లో సైలెంట్ గా ఉన్న బాలాదిత్య కూడా ఈవారం హైలెట్ పెర్ఫామన్స్ ఇచ్చాడు. దీంతో చంటి వెనుకబడిపోయాడు. శనివారం ఎపిసోడ్ లో చంటి తనకి తాను ఫ్లాప్ అంటూ ఒప్పుకుని ఆడియన్స్ కి దూరం అయ్యాడు. అంతేకాదు, హౌస్ లో గత కొన్ని రోజులుగా చంటి ఫుడ్ సరిగా తినట్లేదని కంప్లైట్స్ ఉన్నాయి. దీంతో సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడా అని కూడా అనిపిస్తోంది.
ఏది ఏమైనా చంటి ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కి కూడా షాక్ ఇచ్చింది. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన చంటి టాప్ – 5లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ, ఐదువారాల పాటు చెప్పుకోదగ్గ పెర్ఫామన్స్ ఏమీ ఇవ్వలేదు. అన్ అఫీషియల్ ఓటింగ్స్ లో కూడా ఈవారం అందుకే పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. అదీ మేటర్.