వైజాగ్ లో ఛలో మూవీ గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్

  • February 12, 2018 / 10:52 AM IST

ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్, ఉషా నిర్మాతలుగా నాగశౌర్య, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఛలో. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా వైజాగ్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. చిత్ర యూనిట్ పాల్గొన్న ఈ సెలెబ్రేషన్స్ కు మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా

గీత రచయిత భాస్కరభట్ల మాట్లాడుతూ… మంచి పాట రాసే ఛాన్స్ దొరికింది. నిర్మాతలకు అభినందనలు. నేను రాసిన చూసి చూడంగానే సాంగ్ ఐరా క్రియేషన్స్ కి సిగ్నేచర్ ట్యూన్ గా మారింది. నా కేరీర్లో ఛలో ఆడియో పెద్ద హిట్టవ్వడం నాకు బాగా సంతృప్తినిచ్చింది. దర్శకుడు వెంకీ సిచువేషన్ నరేట్ చేసిన విధానం నాకు నచ్చింది. సాగర్ చాలా మంచి ట్యూన్ ఇచ్చాడు. రాయగానే ఓకే అయ్యింది. ఛల్ గొడవ అనే పాట కూడా రాశాను. ఇండస్ట్రీలో ఈ నిర్మాతలు చాలామందికి పని కల్పించాలి. టీం అందరినీ అభినందిస్తున్నా. శౌర్య నాకు చాలా ఇష్టం. శౌర్య తర్వాతి సినిమాకు కూడా రాస్తాను.

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ… బెస్ట్ పేరేంట్స్ అవార్డు ఈ చిత్ర నిర్మాతలు శంకర్ గారికి, ఉష గారికి ఇవ్వాలి. కుటుంబం అంతా కలిసి శౌర్యకు మంచి హిట్ ఇచ్చారు. గౌతమ్, బుజ్జి గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మహేష్ తర్వాత అంతటి అందగాడు నాగశౌర్య. ఈ విషయం మా అమ్మాగారు చెప్పారు. లవ్ లీ బాయ్ శౌర్య. అతనికి టాలెంట్ కొత్త కాదు. అతని మార్క్ వేసుకుంటున్నాడు. వసూళ్లు 20 కోట్లకు చేరుకుంటున్నాయని సూపర్ స్టార్ కృష్ణ గారు చెప్పారు. వెంకీ కథ చెప్పిన రోజే చెప్పాను సినిమా హిట్టు అవుతుందని. కలిసుండాలనే పాయింట్ ను ఎంచుకొని త్రివిక్రమ్ పేరు కూడా నిలబెట్టాడు. అద్భుతమైన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇచ్చారు. నాగశౌర్య ఎరా స్టార్ట్ అయ్యింది. అందరికీ కంగ్రాట్స్. అని అన్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఈరోజు స్మార్ట్ సిటీగా ఉన్న వైజాగ్ లో స్మార్ట్ హీరో నాగశౌర్య ఛలో సక్సెస్ మీట్ జరగడం చాలా మంచి విషయం. శౌర్య 13వ సినిమాకే ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. వైజాగ్ లో ఇలాంటి ఫంక్షన్స్ మరిన్ని జరగాలి. ఇక్కడ షూటింగ్స్ జరగడం సెంటిమెంట్. ఇక్కడ సినిమా చేస్తే హిట్టు అని అంటారు. నాగశౌర్య భవిష్యత్తులో మంచి మంచి సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.

దర్శకుడు వెంకీ మాట్లాడుతూ…. మా సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. నాగశౌర్య నాకు మా అమ్మా నాన్న తర్వాత అంత ఇంపార్టెంట్ పర్సన్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు. నన్ను నమ్మి సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి దర్శకుడిని చేశాడు. ఎప్పటికీ మర్చిపోలేను. నా టెక్నికల్ టీం చాలా సపోర్ట్ చేశారు. థాంక్యూ సోమచ్. ఐరా క్రియేషన్స్ నాకు ఏం కావాలంటే అది ఇచ్చి ప్రోత్సహించారు. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలో వీళ్లను మించిన వారు లేరు. హీరోయిన్ రష్మిక ఇక్కడ స్టార్ అయ్యింది. అని అన్నారు.

రష్మిక మాట్లాడుతూ… అందరికీ చాలా చాలా థాంక్స్. చాలా సపోర్ట్ చేశారు. మా టీం నన్ను చాలా సపోర్ట్ చేశారు. కన్నడ అమ్మాయికి తెలుగు నేర్పించారు. థాంక్యూ సోమచ్.

నాగశౌర్య మాట్లాడుతూ… ఛలో సక్సెస్ సెలెబ్రేషన్స్ వైజాగ్ లో పెట్టడానికి కారణం… నా ఫస్ట్ మూవీ ఇక్కడే చేశాను. చూసి చూడంగానే సాంగ్ తో బజ్ క్రియేట్ అయ్యింది. సాగర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. మా పీఆర్ఓ టీం ఏలూరు శ్రీను, నివాస్, శ్యాం అద్భుతంగా ప్రమోట్ చేశారు. మీరు మంచి సినిమా తీస్తే మా పీఆర్ఓలు తప్పకుండా పూర్తి న్యాయం చేస్తారు. డిజిటల్ లో ఇన్ఫినిటమ్ రాహుల్ అండ్ టీం అద్భుతంగా వర్క్ చేశారు. భాస్కరభట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు అద్భుతంగా రాశారు. కమెడియన్స్ అని నేను అనను… సుదర్శన్, వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ గారు, హర్ష, సత్య కు చాలా థాంక్స్. హీరోయిన్ రష్మిక చాలా బాగా చేసింది. ఇక్కడ గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు. బాహుబలి సినిమా చేసిన చంటి గారు ఎడిటింగ్ తో పాటు పర్సనల్ గా కూడా చాలా హెల్ప్ చేశారు. సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ గారు లేకపోతే ఈ సినిమా హిట్ కాదు. డైరెక్టర్ వెంకీ చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. కొరటాల శివ గారంత పెద్ద డైరెక్టర్ అవుతాడు. మీడియా మిత్రులకు చాలా చాలా థాంక్స్. పోలీసులు కూడా చాలా హెల్ప్ చేశారు. త్రివిక్రమ్ గారికి చిరంజీవి గారికి చాలా చాలా థాంక్స్. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus