Chandini Chowdary: ఆ ప్రొడ్యూసర్‌ ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నాడు: చాందినీ చౌదరి

  • June 15, 2022 / 12:41 PM IST

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు పెద్దగా ఆకట్టుకోలేరు, ఒకవేళ వచ్చినా వాటిని నిలుపుకోలేరు అంటుంటారు. ఇది టాలీవుడ్‌ వైపు నుండి చూస్తే. అదే ఆ అమ్మాయిల వైపు నుండి చూస్తే టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు, వచ్చినా ఏదో హీరోయిన్ల ఫ్రెండ్స్‌, చిన్న సినిమాలే అని చెబుతుంటారు. ఈ రెండింటిలో ఏది నిజం అనేది పక్కన పెడితే… ఎక్కడో తెలుగు సినిమా అంటే తెలియని ప్రాంతం నుండి అమ్మాయిల్ని తీసుకొచ్చి ‘టాలీవుడ్‌ క్రష్‌’లు మారుస్తున్నారు అనొచ్చు.

ఇలా దిగుమతి వల్ల ఇబ్బంది పడుతున్న తెలుగు హీరోయిన్స్‌లో చాందిని చౌదరి ఒకరు. మరీ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయేటంత అమ్మాయి అని చెప్పం కానీ, మంచి నటనను కనబరిచే అమ్మాయి అని చెప్పొచ్చు. అలాంటి అమ్మాయిని ఓ నిర్మాత ‘నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా’ అని అన్నారట. గతంలో ఎప్పుడో ఓసారి ఈ విషయం చర్చకు వచ్చింది. తాజాగా మరోసారి చాందిని చౌదరి ఈ విషయం గురించి మాట్లాడింది. ఓ టీవీ షోకి వచ్చిన చాందినిని వ్యాఖ్యాత ఈ విషయం గురించి అడిగితే ఈ విషయం గురించి చెప్పింది.

ఓ సినిమా కోసం ఓ పెద్ద నిర్మాతతో అగ్రిమెంట్‌ చేసుకున్నామని, అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకు రావాల్సి వచ్చిందని, దీంతో ఆ వ్యవహారంలో ఆ నిర్మాతతో తమతో చాలా రూడ్‌గా మాట్లాడారని చెప్పింది. ఏకంగా ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తా అనే రేంజిలో వార్నింగ్‌లు ఇచ్చాడని చెప్పింది చాందిని. అయితే ఆ అగ్రిమెంట్‌ చెల్లదని తర్వాత తమకు తెలిసిందని చెప్పుకొచ్చింది చాందిని చౌదరి.

దీంతోపాటు ఆమెను భయపెట్టిన ఓ లవ్‌ స్టోరీ గురించి కూడా చెప్పింది చాందిని. ఓ వ్యక్తి ఇంటికి వచ్చి ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా’ అని అడిగాడని, దాంతో షాక్‌ తినడం తమ వంతైందని చాందిని చెప్పింది. అలా ఎందుకు అన్నాడో, ఏం చేశాడో కూడా అర్థం కాలేదని చెప్పింది చాందిని.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus