Chandramukhi 2: చంద్రముఖి2 మేకర్స్ తప్పు చేస్తున్నారా.. అంత రన్ టైమ్ అవసరమా?
September 16, 2023 / 02:07 PM IST
|Follow Us
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన చంద్రముఖి2 సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా చంద్రముఖి మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఈ సినిమా రన్ టైమ్ గురించి తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది.
చంద్రముఖి2 మూవీ రన్ టైమ్ 2 గంటల 50 నిమిషాలు అని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ రన్ టైమ్ తో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిరాశపరుస్తున్నాయి. కంటెంట్ అద్భుతంగా ఉంటే నిడివి విషయంలో సమస్య లేదని అలా కాకుండా కంటెంట్ వీక్ గా ఉంటే మాత్రం ఇబ్బందేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కంగనా రనౌత్ ఈ సినిమాలో రాజ నర్తకిగా కనిపించనున్నారు.
నిడివి ఎక్కువైనా సమస్య లేదని సినిమా మాత్రం ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ ఫీలవుతున్నారట. ట్రైలర్ రొటీన్ గా అనిపించినా మూవీ కంటెంట్ కొత్తగా ఉందని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించగా ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు సైతం అంచనాలను మించి హిట్ గా నిలిచాయి.
చంద్రముఖి2 (Chandramukhi 2) సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. కంగనా రనౌత్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రముఖి2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదల కానుంది. రాఘవ లారెన్స్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చంద్రముఖి2 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.