lawrence: షూటింగ్ పూర్తి చేసుకున్న చంద్రముఖి 2.. ఆ హీరోయిన్ కి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్!

  • May 30, 2023 / 06:59 PM IST

దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా కొరియోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చంద్రముఖి సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో మనకు తెలిసిందే. అయితే ఇన్ని సంవత్సరాలకు ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ ప్రభు జ్యోతిక నయనతార వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చంద్రముఖి సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు కూడా వాసు దర్శకత్వం వహించగా రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించిన జ్యోతిక పాత్రలో బాలీవుడ్ నటి కంగనా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. ఇక ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో నటుడు రాఘవ లారెన్స్ సీనియర్ నటి రాధికకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో నటి రాధిక కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో లారెన్స్ నటి రాధికకు ఖరీదైన గోల్డ్ రింగ్ తో పాటు ఒక వాచ్ కూడా తనకు గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రాధిక నటుడు (lawrence) లారెన్స్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు లారెన్స్ గిఫ్ట్ గా ఇచ్చిన ఈ విషయాల గురించి రాధిక తెలియజేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక రాధిక కూడా ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె తెలుగులో రామబాణం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus