‘మిడిల్ క్లాస్ మెలొడీస్’.. సీనియర్ నటుడిపై ప్రశంసలు!
November 20, 2020 / 08:34 PM IST
|Follow Us
ఏ ఇండస్ట్రీలోనైనా హీరోని ఎలివేట్ చేసినంతగా ఇతర పాత్రలను ఎలివేట్ చేయరు. చిన్న సినిమా అయినా, పెద్దదైనా దాదాపు అన్ని చిత్రాల్లో హీరోనే హైలైట్అవుతుంటాడు . క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఎంతగా పెర్ఫార్మ్ చేసినా.. హీరోలను మాత్రం బీట్ చేయలేరు. చాలా అరుదైన సందర్భాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు హీరోలను డామినేట్ చేయడం చూశాం. తాజాగా విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలో కూడా ఇదే జరిగింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో గోపరాజు రమణ తండ్రి పాత్రలో నటించింది. ఈయన చాలా ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.
సినిమాలతో పాటు చాలా సీరియల్స్ లో కూడా నటించారు. కానీ ఇప్పటివరకు సరైన గుర్తింపు మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆయన పోషించిన పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గుంటూరు యాసపై పట్టు ఉన్న ఈ నటుడికి అదే యాసలో డైలాగులు చెప్పే ఛాన్స్ రావడం.. కథలో అతడి పాత్రకి మంచి ప్రాముఖ్యత ఉండడంతో చెలరేగిపోయి నటించారు.
సినిమా చూడడం మొదలుపెట్టిన కాసేపటికే ఈ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతుంది. చాలా మంది కొడుకులు, తండ్రులు ఈ పాత్రకి రిలేట్ అవుతారు. ముఖ్యంగా తన కొడుకు వచ్చి ప్రేమ విషయం చెప్పినప్పుడు.. తండ్రిగా అతడు రియాక్ట్ అయ్యే తీరు ఎంటర్టైనింగ్ గా చిత్రీకరించారు. దాదాపు ప్రతి సన్నివేశంలో తండ్రి పాత్ర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గోపరాజు రమణకి నటుడిగా మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పాలి!