రాంచరణ్ – బోయపాటి కాంబినేషన్లో ‘వినయ విధేయ రామ’ చేస్తున్న చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. డీ.వీ.వీ.ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీ.వీ.వీ.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన రెండు పాటలను ఇటీవల విడుదల చేయగా.. వాటికి మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 27 న నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా చరణ్ నటిస్తున్న తరువాతి చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ కు కూడా నిర్మాత డీ.వీ.వీ.దానయ్యే అని తెలిసిందే. జూ.ఎన్టీఆర్ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త ఫిలింనగర్లో షికారు కొడుతుంది. వివారాల్లోకి వెళితే రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ రెండు భారీ చిత్రాలకి డీవీవీ దానయ్య తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రాలకి గానూ .. ఒక్కో చిత్రానికి 18 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. అయితే ఈ రెండు చిత్రాలకు కలిపి రావాల్సిన 36 కోట్లను.. రాజమౌళి చిత్రానికి పెట్టుబడిగా పెట్టి తరువాత లాభాల్లో వాటా ఇవ్వమని కోరాడట. దీనికి నిర్మాత దానయ్య కూడా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా చరణ్ తను చేసే చిత్రాలకి రెమ్యూనరేషన్ గా నైజాంలో ఫస్ట్ షేర్ ను తీసుకునే వాడని అప్పట్లో వార్తలొచ్చేవి. ఇప్పుడు కూడా చరణ్ అదే ఫార్ములా ని అప్లై చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి చిత్రాలకి కచ్చితంగా లాభాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఇలా చేయడం వలన చరణ్ కు భారీ మొత్తం అందుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి లేట్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ చరణ్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా తెలివైన నిర్ణయాలే తీసుకుంటున్నాడని చెప్పాలి.