టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి కౌర్ కి ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో సినిమాలకు దూరమైంది. మధ్యలో ‘జ్యోతి లక్ష్మి’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత ఛార్మికి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె మాత్రం వెండితెరపై కనిపించడానికి ఇష్టపడలేదు. నటిగా సినిమాలకు గుడ్ బై చెప్పేయ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తోంది ఛార్మి. ప్రస్తుతం ఆమె నిర్మించిన ‘రొమాంటిక్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఛార్మి. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
హీరోయిన్ గా నటించే సమయంలో ఎక్కువ కంఫర్ట్ ఉండేదని.. ఫిట్ నెస్ పై దృష్టి పెడితే సరిపోయేదని చెప్పింది. కానీ నిర్మాతగా బాధ్యతలు స్వీకరించడం అంత తేలికైన విషయం కాదని చెప్పింది. ఇప్పుడు అందరి కంఫర్ట్ చూసుకోవాల్సి వస్తుందని నవ్వుతూ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ తనకు విసుగు రావడం లేదని తెలిపింది. ఇప్పటికీ నటిగా అవకాశాలు వస్తున్నాయని.. కానీ నటించే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేసింది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?