Chatrapathi Collections: 16 ఏళ్ళ ‘ఛత్రపతి’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
September 30, 2021 / 02:24 PM IST
|Follow Us
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారాడు అన్నా.. అసలు స్టార్ గా ఎదిగాడు అన్నా అది రాజమౌళి వలనే అని చెప్పాలి. ‘ఈశ్వర్’ తో తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఆ సినిమాతో యావరేజ్ ఫలితాన్నే అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ ప్లాప్ అయ్యింది. ‘వర్షం’ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ ఆ క్రెడిట్ పూర్తిగా ప్రభాస్ కు చెందింది అని చెప్పలేము. దాని తర్వాత వచ్చిన ‘అడవి రాముడు’ ‘చక్రం’ వంటి సినిమాలు ఆ అనుమానాలను మరింత బలోపేతం చేసాయి. అసలు ప్రభాస్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడా అనుకున్న టైములో ‘ఛత్రపతి’ సినిమా వచ్చింది.
‘స్టూడెంట్ నెంబర్1’ ‘సింహాద్రి’ ‘సై’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి కావడంతో సినిమా పై ఓ మోస్తారు అంచనాలు నమోదయ్యాయి. కానీ రిలీజ్ అయ్యాక ‘ఛత్రపతి’ సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు సినిమా మొత్తం ప్రభాసే హైలెట్. సరిగ్గా సినిమాలో అతనికి 3 పేజీల డైలాగులు కూడా ఉండవు. కానీ యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ ను రాజమౌళి ఎలివేట్ చేసిన తీరుకి అంతా ఫిదా అయిపోయారు. సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు.. ఆ ముచ్చట తీర్చింది ‘ఛత్రపతి’. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
5.58 cr
సీడెడ్
2.54 cr
ఉత్తరాంధ్ర
1.66 cr
ఈస్ట్
1.08 cr
వెస్ట్
0.93 cr
గుంటూరు
1.27 cr
కృష్ణా
1.11 cr
నెల్లూరు
0.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
14.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
1.45 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
16.35 cr
‘ఛత్రపతి’ చిత్రానికి రూ.10.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.16.35 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.6.15 కోట్ల వరకు దక్కాయని చెప్పొచ్చు. ‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ (సిరీస్) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 16 ఏళ్ళ తర్వాత ‘ఛత్రపతి’ చిత్రాన్ని దర్శకుడు వి.వి.వినాయక్.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో హిందీలో తెరకెక్కిస్తుండడం విశేషం. అదెలా ఉంటుందో చూడాలి మరి.