Che Long Live Trailer Review: ‘గెలిస్తే న్యాయం చేస్తా.. ఓడితే సహాయం చేస్తా’.. ఆకట్టుకుంటున్న ‘చే’ మూవీ ట్రైలర్

  • November 11, 2023 / 08:55 PM IST

టాలీవుడ్లో రూపొందుతున్న మరో ఇంట్రెస్టింగ్ బయోపిక్ ‘చే’. క్యూబా పోరాట యోధుడుగా చేగువేరా గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కొంతమంది పుస్తకాల రూపంలో ఆయన గురించి తెలుసుకున్నారు. ఇంకొంతమంది పలు హాలీవుడ్ సినిమాల నుండి కొంతవరకు తెలుసుకున్నారు. అయితే టాలీవుడ్ ప్రేక్షకులకి అంతంత మాత్రమే తెలిసిన ఈ వ్యక్తి గురించి చాలా గొప్ప విషయాలు దాగున్నాయి అనేది అక్షర సత్యం. ఇక చేగువేరా బయోపిక్ ను ‘చే’ టైటిల్ తో రూపొందిస్తున్నారు.

‘లాంగ్ లైవ్’ అనేది ఉప శీర్షిక. ‘నవ ఉదయం’ సమర్పణలో ‘నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌’ పై ఎస్.సూర్య,ఎస్.బాబు, ఎస్.దేవేంద్ర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీత దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం..డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. 2 నిమిషాల 33 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘నీ ప్రస్థానం కూనీలు చేసి ఎదిగింది కాదు. నీ ప్రస్థానం దోచుకుని ఎదిగింది కాదు. నీ ప్రస్థానం జనాలు నవ్వుకునే పయనం కాదు. సామాన్యుడి కోసం కోట వదిలిన నీ పయనం ఓ చరిత్ర’ అంటూ సాగే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. తరువాత ‘గుండెలు మీద చేయి వేసుకుని చెప్పగలరా..

ఏ వార్త పత్రిక అయినా, ఏ టీవీ ఛానల్ అయినా ఏ ఒక్కటి రాజకీయ నాయకుడి చేతిలో లేవు అని’.. అనే డైలాగ్ చాలా అగ్రెసివ్ గా అనిపిస్తుంది. చిన్న సినిమా అయినా విజువల్స్ బాగుంటాయని, క్వాలిటీగా ఉంటాయని ట్రైలర్ చెబుతుంది. ఇక ఈ ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. చివర్లో ‘గెలిస్తే న్యాయం చేస్తా.. ఓడితే సహాయం చేస్తా’ అనే డైలాగ్ కూడా ఇంప్రెసివ్ గా అనిపించింది. (Che Long Live Movie ) ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus