నితిన్ గురించి ‘చెక్’ దర్శకుడి ఆసక్తికరమైన కామెంట్స్…!

  • February 19, 2021 / 07:20 PM IST

కెరీర్ ప్రారంభం నుండీ విభిన్న కథాంశం కలిగిన సినిమాలను చేస్తూ వస్తున్నాడు దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి. ‘ఐతే’ ‘అనుకోకుండా ఒకరోజు’ ‘ఒక్కడున్నాడు’ ‘ప్రయాణం’ ‘సాహసం’ ‘మనమంతా’ వంటి చిత్రాలు అన్నీ విమర్శకుల ప్రశంసలు పొందినవే. కానీ ఒక సెక్టార్ ఆడియెన్స్ ను మాత్రమే ఇవి థియేటర్లకు రప్పించాయి.కమర్షియల్ గా ఈ చిత్రాలు ఆడకపోవచ్చు కానీ వీటిని బుల్లితెర పై లేదా ఓటిటిలో చూసిన ప్రేక్షకుడు పాస్ బటన్ ప్రెస్ చెయ్యకుండా చూస్తాడు అనడంలో సందేహం లేదు. అంతలా ఈయన టేకింగ్ ఉంటుంది. అలాంటి చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘చెక్’.

నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కాబోతుంది. ‘భవ్య క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ మరియు ట్రైలర్లు అమితంగా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి కాబట్టి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. నిజానికి నితిన్ తో గతంలోనే ఓ చిత్రం చెయ్యాలని దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి అనుకున్నాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆయన చెప్పుకొచ్చాడు. చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ..

“చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్‌లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్‌’ సినిమా ఇతివృత్తం.ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని దాని మీద పని చేశా. సెకెండాఫ్‌ వర్కవుట్‌ కాక వదిలేశాం. ఈ సినిమాతో మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌ కుదిరింది. నితిన్‌ను తప్ప మరో హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేదు. తను లేకపోతే ఈ చిత్రం లేదు. కల్యాణి మాలిక్‌ సంగీతం సినిమాకు చాలా ప్లస్‌ అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus