‘చెక్’ 11 డేస్ కలెక్షన్స్..!

  • March 9, 2021 / 11:33 AM IST

యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ‘భవ్య క్రియేషన్స్’‌ బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన చిత్రం ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం… ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షో నుండీ ఈ చిత్రానికి…పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది ‘చెక్’.చెప్పాలంటే మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ ఆ తరువాత నుండీ డౌన్ అవుతూ వచ్చింది.రెండో వీకెండ్ కూడా ఎక్కువ థియేటర్లలోనే ప్రదర్శింపబడినప్పటికీ.. ఏమాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.దాంతో సోమవారం నాడు ‘చెక్’ ను చాలా థియేటర్ల నుండీ తొలగించారు.

ఇక ‘చెక్’ 11 డేస్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం   3.27 cr
సీడెడ్   1.00 cr
ఉత్తరాంధ్ర   1.17 cr
ఈస్ట్   0.47 cr
వెస్ట్   0.57 cr
గుంటూరు   0.95 cr
కృష్ణా   0.56 cr
నెల్లూరు   0.30 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   8.25 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.35 cr
ఓవర్సీస్   0.71 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   9.35 cr

‘చెక్’ చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం తక్కువ థియేటర్లలోనే రన్ అవుతుంది ‘చెక్’. మరో 3 రోజుల్లో ‘శ్రీకారం’ ‘జాతి రత్నాలు’ ‘గాలి సంపత్’ వంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ‘చెక్’ కు కష్టమనే చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus