మణిరత్నం సినిమాలో మెరిసిన చిన్నారి ఇప్పుడెలా ఉండో చూడండి

  • May 15, 2018 / 10:04 AM IST

మణిరత్నం దర్శకత్వంలో మాధవన్-సిమ్రాన్ జంటగా తెరకెక్కిన “అమృత” సినిమా గుర్తుందా?. ఆ సినిమాలో మాధవన్-సిమ్రాన్ లు తన తల్లిదండ్రులు కాదని తెలుసుకొని, తన తల్లి ఓ నక్సలైట్ అని తెలిసి కూడా ఒక్కసారైనా తన తల్లిని కలుసుకోవాలని పరితపించే చిన్నారి కీర్తన ఇప్పుడెలా ఉందో చూడాలని ఉందా. ఆమె ఎవరో కనీసం సగం మందికైనా తెలుసు అనుకొంటున్నాం. ఆ చిన్నారి మరెవరో కాదు తెలుగు, తమిళ భాషల్లో వందల సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సీత కుమార్తె. సీత కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పార్తిబన్ అనే తమిళ నటుడ్ని పెళ్లి చేసుకొని, పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వచ్చింది.

వాళ్ళ కుమార్తె కీర్తన మణిరత్నం “అమృత” చిత్రంలో మాధవన్-సిమ్రాన్ ల ముద్దుల కూతురిగా నటించిన నేషనల్ అవార్డ్ సైతం దక్కించుకొంది. ఆ తర్వాత కీర్తనకి బోలెడు ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ ఆమె మాత్రం మరో సినిమా అంగీకరించలేదు. చాన్నాళ్లుగా మీడియాకి, సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నా కీర్తన ఇటీవల ఒక ఫ్యామిలీ ఈవెంట్ కోసం తల్లి సీతతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అచ్చు చిన్నప్పటి అమృతలానే ఉన్న కీర్తనను మీరు కూడా ఒకసారి చూడండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus