నాకు, రకుల్ కు వచ్చే మెసేజ్ లు షేర్ చేస్తే.. అందులో కొట్టుకుపోతారు..!
January 19, 2019 / 07:37 AM IST
|Follow Us
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ కారణం లేకుండా తనను తిట్టిపోస్తున్నారని.. చాలామంది వేధిస్తున్నారని గాయని చిన్మయి శ్రీపాద ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తు తనను హోటల్ గదికి రమ్మని ఓ వ్యక్తితో కబురు పంపారని ‘మీటూ’ ఉద్యమ సమయంలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ విషయం పై తాజాగా ఓ నెటిజన్ చిన్మయిని అసభ్యకరంగా విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై చిన్మయి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
చిన్మయి తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… “సోషల్ మీడియాలో విమర్శలు చేసేవారు చాలా మంది ఉంటారు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే.. సైలెంట్ గా ఉండాలేమో.. వాళ్ళు ఎంత తిట్టినా కామ్ గా ఉండాలి. మళ్ళీ ఆ దరిద్రుల్ని సార్.. అన్నా.. అంటూ పిలవాలి. అత్యాచారం చేస్తామంటూ మూర్ఖంగా ట్వీట్స్ పెడుతున్నారు, ఖర్మ కాకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు బ్రతికున్నారో అర్ధం కావడం లేదు..! ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేస్తే ఈ విషయంలో ట్విట్టర్ మాత్రం ఏం చేస్తుంది.. ఇక పోలీసులకు కూడా చాలా భారమే..! నాకు, రకుల్‌ప్రీత్ సింగ్‌కు, ఇంకా చాలా మంది నటీమణులకు రోజూ వచ్చే ఇలాంటి చెత్త మెసేజ్ లను షేర్ చేస్తే మీరు అందులో కొట్టుకుపోతారు. సమాజం మారింది.. కానీ ఇంకా చాలా మారాలి. మహిళలు ఓపికగా ఉండాలి’’ అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి.