Chiranjeevi, Amala: 33 ఏళ్ళ క్రితం చిరంజీవి- అమల కాంబినేషన్లో వచ్చిన సినిమా.. దాని ఫలితం ఏంటంటే?
November 15, 2023 / 03:59 PM IST
|Follow Us
‘కింగ్’ నాగార్జున సతీమణి అమల అందరికీ సుపరిచితమే. చాలా మందికి ఈమె అక్కినేని ఇంటి కోడలిగా, అఖిల్ కి అమ్మగా మాత్రమే తెలుసు. కానీ ఒకప్పుడు ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది అనే విషయం ఇప్పటి జనరేషన్ కి తెలిసుండకపోవచ్చు. ఒకప్పుడు ఈమె తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిన సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. నాగార్జున హీరోగా నటించిన ‘కిరాయి దాదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమల..
అటు తరువాత వెంకటేష్ తో ‘రక్తతిలకం’ ‘అగ్గిరాముడు’, రాజశేఖర్ తో ‘ఆగ్రహం’.. మళ్ళీ నాగార్జునతో ‘చినబాబు’ ‘శివ’ ‘నిర్ణయం’ ‘ప్రేమ యుద్ధం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ చిరంజీవికి జోడీగా కూడా అమల ఓ సినిమాలో నటించింది. ఇప్పటి జనరేషన్లో చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. అదే ‘రాజా విక్రమార్క’ అవును 1990 నవంబర్ 14 న రిలీజ్ అయ్యింది ‘రాజా విక్రమార్క’. రవి రాజా పినిశెట్టి ఈ చిత్రానికి దర్శకుడు.
‘స్కంద ఆర్ట్స్’ బ్యానర్ పై పి.అమరనాథ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కమింగ్ టు అమెరికా’ అనే అమెరికన్ మూవీ స్పూర్తితో ‘రాజా విక్రమార్క’ రూపొందింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. చిరంజీవి – అమల పెయిర్ కూడా ప్రేక్షకులకి నచ్చలేదు. పైగా సాంకేతిక లోపాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అంతా పెదవి విరిచారు.
ఈ విధంగా (Chiranjeevi) చిరు- అమల.. కాంబోలో వచ్చిన ఈ క్రేజీ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా ఘోర పరాజయం పాలైంది అని చెప్పాలి.అయితే ‘రాజా విక్రమార్క’ చిత్రం రిలీజ్ అయ్యి నేటితో 33 ఏళ్ళు పూర్తవడం విశేషంగా చెప్పుకోవాలి.