Chiranjeevi: తాను చేసిందే కరెక్ట్ అంటున్న చిరంజీవి!
April 26, 2022 / 09:43 AM IST
|Follow Us
ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల దాదాపుగా సంవత్సరం పాటు పెద్ద సినిమాల నిర్మాతలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కృషి వల్ల ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమైంది. చిరంజీవి సీఎం జగన్ ను ఎన్నోసార్లు కలవడంతో పాటు పెద్ద సినిమాలకు అనుకూలంగా టికెట్ రేట్లు ఉండే విధంగా ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు ఏపీలో టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి.
అయితే చేతులు జోడించి జగన్ ను టికెట్ రేట్లను పెంచాలని కోరడం గురించి చిరంజీవి మాట్లాడుతూ నన్ను విమర్శించినా తిట్టినా పట్టించుకోనని వెల్లడించారు. ఈ పాలసీని తాను మొదటినుంచి అనుసరిస్తున్నానని మెగాస్టార్ తెలిపారు. తాను సీఎంను చేతులు జోడించి వేడుకున్నానని సీఎం కుర్చీకి తాను ఆ గౌరవం ఇచ్చానని చిరంజీవి చెప్పుకొచ్చారు. గతంలో తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో చాలామంది సీఎంలు తన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూశారని ఆయన తెలిపారు.
అది వాళ్లు నా కుర్చీకి ఇచ్చిన గౌరవమని ఆయన కామెంట్లు చేశారు. జగన్ విషయంలో తాను సరిగ్గానే వ్యవహరించానని ఇండస్ట్రీ సమస్యను ఒక దారికి తీసుకొనిరావాలని తాను భావించానని ఆయన తెలిపారు. టికెట్ రేట్ల ఇష్యూ సాల్వ్ కాకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చేవా అని ఆయన ప్రశ్నించారు. బాధ్యతగా ఆలోచించాను కాబట్టే ఇండస్ట్రీ కళకళలాడుతోందని ఆయన తెలిపారు.
నేను చేతులు జోడించి సీఎంను వేడుకోవడం గురించి ఎవరెవరు ఏమేం మాట్లాడారో తనకు తెలుసని నా ఒక్కని కోసం అలా చేసి ఉంటే నేను సిగ్గు పడేవాడినని లక్షలాది మంది సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చాడని తాను భావించానని చిరంజీవి అన్నారు. చిరంజీవి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టికెట్ రేట్ల పెంపు వల్ల ఆచార్య సినిమాకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. ఆచార్య మూవీ థియేట్రికల్ హక్కులు 135 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.