Chiranjeevi, Saindhav: ఆ లెక్క ప్రకారం సైంధవ్ హిట్ అంటున్న మెగాస్టార్.. ఇదే ప్రూఫ్ అంటూ?

  • January 2, 2024 / 01:08 PM IST

వెంకటేశ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన సైంధవ్ మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుండగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వెంకీ అభిమానులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వరుస విజయాలు సాధిస్తున్న శైలేష్ కొలను సైంధవ్ తో మరోమారు బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

చిరంజీవి, వెంకటేశ్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవిపై ఎప్పుడూ విమర్శలు చేయని వెంకటేశ్ ఒకానొక సందర్భంలో మాత్రం విమర్శలు చేశారట. చిరంజీవి తను నటించిన డాడీ సినిమా గురించి ప్రస్తావిస్తూ ఈ కామెంట్లు చేశారు. నేను నటించిన డాడీ సినిమా గురించి వెంకీ ఊహించని కామెంట్ చేశాడని ఆ సినిమా అబవ్ యావరేజ్ గా ఆడిందని చిరంజీవి తెలిపారు.

అయితే ఆ సినిమాలో నేను బాగా చేయలేదని వెంకీ చెప్పాడని నేను నటించాను కాబట్టి డాడీ సోసోగా ఆడిందని అదే సినిమా తను చేసి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేదని అన్నాడని చిరంజీవి కామెంట్లు చేశారు. తండ్రీ కూతురు సెంటిమెంట్ ను తాను బాగా చేస్తాననే కాన్ఫిడెన్స్ తో వెంకటేశ్ ఆ మాట చెప్పాడని (Chiranjeevi) చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

సైంధవ్ సినిమా కూడా తండ్రీ కూతురు కథతో తెరకెక్కుతున్న నేపథ్యంలో చిరంజీవి ఈ కామెంట్ చేశారు. ఆ లెక్క ప్రకారం సైంధవ్ హిట్ అంటూ మెగాస్టార్ పరోక్షంగా కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నో ప్రత్యేకతలతో సైంధవ్ మూవీ తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సైంధవ్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus