Sreeja: ప్రేమ గురించి శ్రీజ షాకింగ్ కామెంట్స్.. అలా అనడంతో?
February 15, 2023 / 06:32 PM IST
|Follow Us
టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో కళ్యాణ్ దేవ్ శ్రీజ జోడీ కూడా ఒకటి. వీళ్లిద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అటు కళ్యాణ్ దేవ్ కానీ ఇటు శ్రీజ కానీ ఈ వార్తల గురించి నోరు మెదపలేదు. మెగా హీరోలు సైతం ఈ వార్తల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా కళ్యాణ్ దేవ్, శ్రీజ చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో వాలెంటైన్స్ డే విషెస్ చెబుతూ మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేదే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. ఆ పోస్ట్ కు కౌంటర్ గా శ్రీజ లవ్ అంటే నీతో ప్రేమలో పడేసుకోవడం కాదని తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతుక్కోకూడదు” అని ఆమె వెల్లడించడం గమనార్హం. అయితే శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు.
సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల గురించి శ్రీజ కళ్యాణ్ దేవ్ స్పందించి స్పష్టత ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు వ్యక్తమతువున్నాయి. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. శ్రీజ కళ్యాణ్ దేవ్ లకు వేర్వేరుగా సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
శ్రీజ సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. శ్రీజ జాతకం ప్రకారం ఆమె మూడో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల గురించి స్పందించడానికి శ్రీజ ఇష్టపడటం లేదు. శ్రీజ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.