Sushmita: సుస్మిత హీరోయిన్ గా ఓ సినిమాలో నటించారని మీకు తెలుసా?

  • July 3, 2023 / 02:00 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మెగా సామ్రాజ్యాన్ని విస్తరింప చేశారు నటుడు చిరంజీవి. ఇలా హీరోగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే మెగా ఆడపడుచులు మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.

నిహారిక యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా పలు సినిమాలలో నటించారు. అయితే ఈమె నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. ఈ విధంగా నిహారిక సినిమాలో నిర్మిస్తూనే కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా ఇండస్ట్రీలో పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ అనంతరం నిర్మాతగా స్థిరపడ్డారు.

ప్రస్తుతం ఈమె కూడా సినిమాలు వెబ్ సిరీస్లను నిర్మిస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సుస్మిత కూడా హీరోయిన్గా ఒక సినిమాలో నటించారని తెలుస్తుంది. సుస్మితను ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేయాలని చిరంజీవి భావించారట అయితే తనని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం రావడంతో చిరంజీవి ఆ ఆలోచనను విరమించు కున్నారని తెలుస్తోంది.

అయితే (Sushmita) ఈమె హీరోయిన్ గా ఒక సినిమాలో మాత్రం నటించారు. అయితే ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో విడుదలకు నోచుకోలేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సుస్మిత ఉదయ్ కిరణ్ జంటగా ఓ సినిమాలో నటించారు.ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ హాఫ్ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus