Chiranjeevi: 30 ఏళ్లుగా మెగాస్టార్ కి డూప్.. ఎవరో తెలుసా..?
December 29, 2021 / 10:17 AM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరవై ఏళ్లు దాటినా.. ఇప్పటికీ తన నటనతో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. సాధారణంగా హీరో, హీరోయిన్లకు డూప్స్ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని షాట్ ను డూప్ లతో చేయిస్తూ ఉంటారు దర్శకనిర్మాతలు. రిస్కీ షాట్స్ అంటే.. కొంతమంది హీరోలు ముందుకురారు. అలాంటి సమయంలో డూప్ లతో ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇంతకముందు మన సెలబ్రిటీలకు డూప్ లుగా ఎవరు వ్యవహరిస్తారో తెలిసేది కాదు.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వీరందరినీ వెతికి పట్టుకొని వచ్చి మరీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవికి డూప్ గా చేస్తోన్న వ్యక్తికి ఆదరణ లభిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్టూర్‌కి చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్లుగా చిరంజీవి డూప్‌గా చేస్తున్నారట. అంతేకాదు.. ప్రేమ్ కుమార్ కి రికార్డింగ్ డాన్స్ పేరుతో ఓ కంపెనీ కూడా ఉంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రికార్డింగ్ డాన్సర్స్ అంటే చాలా మందికి చిన్నచూపు అని.. వారికి ఆదరణ లభించలేదంటూ వాపోయారు. ముప్పై ఏళ్లుగా చిరుకి డూప్ గా చేస్తున్నానని.. ఇది తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు చిరు. అలానే బాబీ, మెహర్ రమేష్ లాంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. రీసెంట్ గా వెంకీ కుడుముల ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు.