Chiranjeevi: తొలిసారి ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరు… వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో!
November 16, 2021 / 12:39 PM IST
|Follow Us
నిన్న మొన్నటివరకు సినీ పరిశ్రమ పై టికెట్ రేట్ల విషయం పై ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై కాస్త సున్నితంగా వ్యవహరిస్తూ వచ్చిన చిరు.. ఇప్పుడు సహనం కోల్పోయినట్లు స్పష్టమవుతుంది. ఆదివారం నాడు జరిగిన సంతోషం-సుమన్ టీవీ సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్-2021 కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యి…. విన్నర్స్ కు తన చేతుల మీదగా అవార్డ్స్ అందించడంతో పాటు.. ఈ వేదిక పై ఏపి ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ …” సినీ పరిశ్రమే కదా? వీళ్లది ఏముంది అనుకుంటున్న నాయకుల్లారా మమ్మల్ని నిర్లక్ష్యంగా చూడకండి. మా దగ్గర డబ్బులు ఎక్కువైపోయి రూ.100 కోట్ల ఖర్చుతో సినిమాలు చేయడం లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి మాత్రమే భారీగా ఖర్చు చేస్తూ నిరంతరం పనిచేస్తున్నాం. టికెట్ రేటు ఇంతే ఉండాలి అంటే.. పెద్ద సినిమాలు ఎలా తీయగలం? ఇండస్ట్రీ బాగుంటేనే ప్రభుత్వానికి ట్యాక్స్ లు వస్తాయి. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇంత గొప్ప సినీ పరిశ్రమ గురించి ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వానికి ట్యాక్స్ లు రావాలి… మీకు రావలసిన ట్యాక్స్ మీరు తీసుకోండి.
దాన్ని ఎవ్వరూ తప్ప పట్టరు. కానీ.., టికెట్ల రేట్లు మీరు ఎలా ఫిక్స్ చేస్తారు?తెలుగు రాష్ట్రాల్లోని సినిమా వాళ్ళ కష్టాల గురించి నాయకులకు అర్ధమయ్యేలా చెప్పాలని మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశా. కానీ.., మీ నుండి స్పందన రాలేదు. అందుకే ఇలా ఓపెన్ గా చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ ప్రభుత్వాలను నేను వేడుకునేది ఒక్కటే. తెలుగు సినిమాకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి. కళాకారులను గౌరవించండి. గతంలో రాజులు కళలను ఆదరించేవారు. కళాకారులను గౌరవించేవారు. ఈ తరంలో పాలించే వారే రాజులు. మీరు కళాకారులను గౌరవిస్తే సినీ పరిశ్రమ పచ్చగా ఉంటుంది. ఇక్కడ కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకెన్ స్టార్స్ ఐదు మంది మాత్రమే. తిండి కోసం కూడా కష్టపడే వేల కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారి కోసమే నా ఆవేదన” అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.